నీళ్లు తాగుతున్న చిరుత.. సడన్గా గాల్లోకి లేచిన మొసలి.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:51 AM
అడవిలో జరిగే కొన్ని సంఘటనలు చాలా సహజ సిద్ధంగా ఉంటాయి. జంతువుల మధ్య పోరాటం, ప్రకృతి విపత్తులకు సంబంధించిన దృశ్యాలు ఆసక్తితోపాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారతాయి.
ఇంటర్నెట్ డెస్క్: అడవిలో జరిగే కొన్ని సంఘటనలు చాలా సహజ సిద్ధంగా ఉంటాయి. జంతువుల మధ్య పోరాటం, ప్రకృతి విపత్తులకు సంబంధించిన దృశ్యాలు ఆసక్తితోపాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారతాయి. అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. నీటిని తాగేందుకు చెరువు వద్దకు చిరుత వచ్చింది. ప్రశాంతంగా నీరు తాగుతోంది. అంతలో నీటిలోని ముసలి అమాంతం ఆ చిరుతపై దాడి చేసింది. చిరుత తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ ముసలి.. తన నోటితో దానిని బలంగా పట్టుకుంది.
అనంతరం నీటిలోకి చిరుతను అత్యంత వేగంగా లాక్కెళ్లింది. ముసలి నోటికి చిక్కిన చిరుత గిలగిల తనుకుంటుంది. ఎలాగైనా ప్రాణాలతో బయట పడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా చిరుతను ఆ ముసలి విడిచిపెట్టలేదు. ఈ వీడియోను @zunrong-17m అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి.. లైకులు కొట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ముసలి ప్రమాదకరమైదని అని ఒకరు అభివర్ణించారు. చిరుత చాలా వాటిని వేటాడుతోంది. కానీ ఈ రోజు అది బాధితురాలు అయిందని పేర్కొన్నారు.