Share News

టీవీ లైవ్‌కు కొన్ని క్షణాల ముందు భారీ పేలుడు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:46 PM

దక్షిణ లెబనాన్‌‌లో భయానక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ కోసం సిద్ధమవుతుండగా.. అతడికి కొద్దిదూరంలోనే భారీ పేలుడు సంభవించింది. దీంతో రిపోర్టర్‌తో పాటు కెమెరామ్యాన్‌కు గాయాలు అయ్యాయి.

టీవీ లైవ్‌కు కొన్ని క్షణాల ముందు భారీ పేలుడు.. వీడియో వైరల్..
Lebanon blast video

ఇంటర్‌నెట్ డెస్క్: దక్షిణ లెబనాన్‌‌లో భయానక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ కోసం సిద్ధమవుతుండగా.. అతడికి కొద్దిదూరంలోనే భారీ పేలుడు సంభవించింది. దీంతో రిపోర్టర్‌తో పాటు కెమెరామ్యాన్‌కు గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...


దక్షిణ లెబనాన్‌లోని నబాతిహ్ నగరంలో 'అల్-మనార్' టీవీకి చెందిన రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మరికొన్ని సెకన్లలో లైవ్ అవ్వనుండగా.. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. రిపోర్టింగ్ జరగాల్సిన ప్రదేశంలో భారీ పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్ దాడిలో రిపోర్టర్ అలీ షబీబ్, కెమెరామ్యాన్ మొహమ్మద్ బర్జావి గాయపడ్డారు. రెస్క్యూ టీమ్ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.


కాగా, పేలుడు సంభవించిన ప్రాంతంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, హిజ్బుల్లా మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ పేలుడుకు కొద్దిసేపటి ముందే హిజ్బుల్లా దళాలు ఇజ్రాయెల్ సైనికులపై డ్రోన్ దాడులు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఈ వైమానిక దాడికి పాల్పడిందని తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

మామిడిచెట్లకు ట్యాంకర్లతో నీరు

ప్రజా ప్రదేశాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎమ్మెల్యే పద్మావతి

Updated Date - Sep 08 , 2026 | 01:53 PM