Share News

యువకుడి పైత్యం.. 40 అడుగుల కరెంట్ పోల్‌పైకి ఎక్కి పుల్‌అప్స్..

ABN , Publish Date - Aug 07 , 2026 | 07:30 AM

పశ్చిమ బెంగాల్‌‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు 40 అడుగుల ఎత్తైన కరెంట్ పోల్‌పైకి ఎక్కి పుల్‌అప్స్ తీశాడు.

యువకుడి పైత్యం.. 40 అడుగుల కరెంట్ పోల్‌పైకి ఎక్కి పుల్‌అప్స్..
Kolkata Viral Video

ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు 40 అడుగుల ఎత్తైన కరెంట్ పోల్‌పైకి ఎక్కి పుల్‌అప్స్ తీశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం ఓ యువకుడు కోల్‌కతా, శ్యామ్ బజార్‌లోని మెయిన్ రోడ్డుపై ఉన్న పోల్‌పైకి ఎక్కాడు. వాహనదారులు ఎంత చెప్పినా అతడు కిందకు దిగలేదు. దీంతో వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చారు. ఆ యువకుడిని పోల్ మీద నుంచి కిందకు దించే ప్రయత్నం చేశారు.


అయితే, ఆ యువకుడు కిందకు రాలేదు. పోల్ మీద నుంచి కిందకు వేలాడుతూ పుల్‌అప్స్ తీయటం మొదలెట్టాడు. ఆ యువకుడు ఎవరు? ఎందుకలా చేశాడు? అగ్ని మాపక సిబ్బంది అతడిని ఎలా కిందకు తీసుకువచ్చారు అన్నది తెలియరాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 21 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన

Updated Date - Aug 07 , 2026 | 07:40 AM