Share News

లగ్జరీ క్యారవాన్ తయారు చేయించుకున్న స్టార్ హీరో.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:32 PM

ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌కు చెందిన అత్యంత ఖరీదైన క్యారవాన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిచ్చ సుదీప్ తన వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు క్యారవాన్‌ను తయారు చేయించుకున్నారు.

లగ్జరీ క్యారవాన్ తయారు చేయించుకున్న స్టార్ హీరో.. ధర తెలిస్తే షాక్ అవుతారు..
luxury caravan

ఇంటర్‌నెట్ డెస్క్: సినిమా యాక్టర్లు షూటింగ్‌ల సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం క్యారవాన్‌లు వాడుతుంటారు. కొంతమంది స్టార్ హీరోలకు సొంతంగా లగ్జరీ క్యారవాన్‌లు ఉన్నాయి. ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌కు చెందిన అత్యంత ఖరీదైన క్యారవాన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిచ్చ సుదీప్ తన వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు క్యారవాన్‌ను తయారు చేయించుకున్నారు. ఆ క్యారవాన్‌ను డీసీ2 కంపెనీ తయారు చేసినట్లు తెలుస్తోంది.


ఇందుకోసం సుదీప్ 6.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ఖరీదైన క్యారవాన్ ఇదే కావటం విశేషం. ఆ క్యారవాన్ గ్రే కలర్‌లో.. బుల్లెట్ ట్రైన్‌ను పోలినట్లు ఉంది. కిచ్చ సుదీప్ పేరుకు చిహ్నంగా దానిపై కే అనే అక్షరం కూడా ఉంది. కిచ్చ సుదీప్ ప్రస్తుతం ‘బిల్ల.. రంగా.. భాషా’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సినిమా సెకండ్ షెడ్యూల్ జూన్ 26వ తేదీ నుంచి మొదలైంది. సుదీప్ కొత్తగా డెలివరీ అయిన ఆ క్యారవాన్‌తో షూటింగ్‌లో పాల్గొంటారట. ఇక, కిచ్చ సుదీప్‌కు చెందిన ఆ లగ్జరీ క్యారవాన్ శాండల్‌వుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.


ఇవి కూడా చదవండి

ఇది జెన్ జీతోనే సాధ్యం.. ముందు తరాలకు అంత సీన్ లేదు.. వైరల్ పోస్టు

ప్రధాని మోదీ సీషెల్స్‌ పర్యటన.. విక్టోరియాలో ఘన స్వాగతం..

Updated Date - Jun 27 , 2026 | 06:40 PM