Share News

కేరళం అసెంబ్లీ ఎన్నికలు.. వైరల్‌గా మారిన ఎన్నికల కమిషనర్ డ్యాన్స్ వీడియో..

ABN , Publish Date - Apr 08 , 2026 | 01:42 PM

కేరళ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ రతన్ యు కేల్కర్, జిల్లా కలెక్టర్ అను కుమారీ గ్రూవే కొంతమంది యువతీ, యువకులతో కలిసి డ్యాన్స్ వీడియో రూపొందించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేరళం అసెంబ్లీ ఎన్నికలు.. వైరల్‌గా మారిన ఎన్నికల కమిషనర్ డ్యాన్స్ వీడియో..
Kerala CEO viral video

తిరువనంతపురం, ఏప్రిల్ 8: కేరళంలో రేపు (గురువారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవటంపై జనరేషన్ జీ యువతకు అవగాహన కల్పించడానికి కేరళ అధికారులు వినూత్న పంథా ఎంచుకున్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ రతన్ యు కేల్కర్, జిల్లా కలెక్టర్ అను కుమారీ గ్రూవే కొంతమంది యువతీ, యువకులతో కలిసి డ్యాన్స్ వీడియో రూపొందించారు. కొల్లాంకు చెందిన 22 ఏళ్ల జర్నలిజం విద్యార్థిని మానసా ఆర్బీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.


సీఈఓ కేరళ ఆఫీస్ సాంగ్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ రతన్ యు కేల్కర్, జిల్లా కలెక్టర్ అను కుమారీ గ్రూవేపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ‘యువతకు అర్థం కావాలంటే వారి భాషలోనే చెప్పాలి. సీఈఓ, కలెక్టర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు’..‘ఈ వీడియో ఇన్‌స్టాలో చాలా వైరల్‌గా మారింది. ఎంతో మంది కేరళ యువతీ, యువకులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన వచ్చింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్... కేసీఆర్‌తో భేటీ

Updated Date - Apr 08 , 2026 | 01:50 PM