Share News

అర్ధరాత్రి భర్త కోసం భార్య చేసిన పని.. నెటిజన్ల మనసు గెలుచుకున్న ప్రేమకథ..

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:18 PM

చాలా మంది ప్రేమంటే భాగస్వామికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం, విలాసవంతమైన జీవితాన్ని అందించడమే అనుకుంటారు. నిజానికి కష్టసమయంలో తోడుగా నిలవడం, మనసుకు దగ్గరగా ఉండటమే స్వచ్ఛమైన ప్రేమ. ఈ విషయాన్ని నిరూపించారు జైపూర్‌కు చెందిన ఓ జంట.

అర్ధరాత్రి భర్త కోసం భార్య చేసిన పని.. నెటిజన్ల మనసు గెలుచుకున్న ప్రేమకథ..
Jaipur Couple

జైపూర్: చాలా మంది ప్రేమంటే భాగస్వామికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం, విలాసవంతమైన జీవితాన్ని అందించడమే అనుకుంటారు. నిజానికి కష్టసమయంలో తోడుగా నిలవడం, మనసుకు దగ్గరగా ఉండటమే అసలైన ప్రేమ. ఈ విషయాన్నే నిరూపించారు జైపూర్‌కు చెందిన భార్యాభర్తలు. అర్ధరాత్రి వేళ ఓ ప్రైవేట్ బ్యాంకు వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డుకు అతని భార్య ఇంట్లో వండిన భోజనం తీసుకెళ్లింది. భర్త విధుల్లో ఉన్నప్పటికీ, కొంత సమయం గడపాలనే ఉద్దేశంతో వెళ్లి అతనితో కలిసి భోజనం చేసింది.


బ్యాంకు మూసివేసిన తర్వాత బయట ఉన్న చిన్న ప్రదేశంలో దంపతులు కలిసి కూర్చొని భోజనం చేశారు. ఆ సమయంలో వారిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్న దృశ్యాలు అటుగా వెళ్తున్న వారిని ఆకట్టుకున్నాయి. ఈ ఘటనను వీడియో తీసిన జ్ఞానాద్ భట్ అనే ఎక్స్ యూజర్.. అనంతరం తన ఖాతాలో పోస్ట్ చేశాడు. దాదాపు 20 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘నీ జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు తోడుగా ఉండటం ఒక ఎత్తు.. కష్టాల్లో ఉన్నప్పుడూ నీతోనే ఉండటం మరో ఎత్తు’ అంటూ ఆ భార్యాభర్తలను జ్ఞానాద్ కొనియాడారు. మరోవైపు, నెటిజన్లూ వారి ప్రేమను ప్రశంసిస్తున్నారు.


ప్రస్తుతం చాలామంది ఉద్యోగం, హోదా, డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారినే వివాహం చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ దంపతుల మధ్య కనిపించిన ఆప్యాయత నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. భాగస్వామి సంపాదన ఎంత? హోదా ఏమిటి? అనే విషయాల కంటే వారి పక్కన నిలబడి, సమయాన్ని పంచుకునే జీవిత భాగస్వామి ఉండటమే నిజమైన అదృష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


ఈ వార్తలు కూడా చదవండి

స్కూటీని ఢీకొట్టిన ట్రక్కు.. ప్రాణాలతో బయటపడిన యువతి..

ఇది కదా బిజినెస్ అంటే.. చిన్న ఐడియాతో లక్షలు సంపాదిస్తున్న మహిళ

Updated Date - Oct 10 , 2026 | 05:25 PM