Share News

ఇరాన్ గగనతలంలో వింత వెలుగులు.. 40 ఏళ్ల తరువాత అదే సీన్?

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:49 PM

ఇరాన్ గగనతలంలో రకరకలా వెలుగులు విరజిమ్ముతూ ఓ వింత వస్తువు కనిపించడం కలకలానికి దారి తీసింది.

ఇరాన్ గగనతలంలో వింత వెలుగులు.. 40 ఏళ్ల తరువాత అదే సీన్?
Iran Strange Lights

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ గగనతలంలో ఇటీవల రకరకలా వెలుగులు విరజిమ్ముతూ ఓ వింత వస్తువు కనిపించడం కలకలానికి దారి తీసింది. 1976లో కూడా ఇరాన్ గగనతలంలో ఇలాంటి వెలుగులే కనిపించాయి. దీంతో, అసలేం జరిగిందనేదానిపై ఇరాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.


నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, టెహ్రాన్ గగనతలంలో రకరకాల వెలుగులు విరజిమ్మే వస్తువు కనిపించింది. సెప్టెంబర్ 20న స్థానికులు ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఆ వస్తువు సైజు, ఎంత ఎత్తున ఉంది, ఎంత వేగంతో వెళుతోంది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇరాన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ వీడియోలు మరింత సస్పెన్స్ కలుగజేస్తున్నాయి. వీడియోలపై కొందరు స్పందిస్తూ అది డ్రోన్ అయి ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశారు. మరికొందరేమో పక్కపక్కనే పలు డ్రోన్స్‌ ఉండటంతో వింతవస్తువుగా కనిపించి ఉండవచ్చని అన్నారు.


ఇరాన్‌లో అనేక మందికి తాజా వీడియోలు 1976 నాటి ఘటనలు గుర్తుకు తెచ్చాయి. అప్పట్లో సెప్టెంబర్ 19న ఇరాన్ గగనతలంలో ఇలాంటి వింత వెలుగులే కనిపించాయి. అవేంటో తెలుసుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం యుద్ధ విమానాలను పంపించింది. అమెరికా కూడా ఈ విషయాలపై అప్పట్లో దృష్టిసారించింది. జాతీయ భద్రతా సలహాదారు, అమెరికా త్రివిధ దళాధిపతులు ఈ విషయంపై సమీక్ష నిర్వహించినట్టు ఇటీవల బహిర్గతమైన కొన్ని ప్రభుత్వ దస్త్రాల్లో వెల్లడైంది.


ఈ వార్తలనూ చదవండి:

6 అడుగుల రోబోతో ఫైట్.. కడుపులో ఒక్క కిక్ ఇవ్వడంతో..

కదులుతున్న విమానంలో నిలబడ్డ ప్రయాణికులు.. వీడియో వైరల్

Updated Date - Sep 21 , 2026 | 08:59 PM