Share News

కిలోల బంగారం పదినెలల కష్టం.. విరోష్ పెళ్లి నగల స్పెషాలిటీ ఇదే

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:54 PM

పెళ్లిలో విజయ్, రష్మికల జంట ధరించిన పెళ్లి ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జంట ధరించిన ఆభరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కిలోల బంగారం పదినెలల కష్టం.. విరోష్ పెళ్లి నగల స్పెషాలిటీ ఇదే
Vijay Rashmika wedding

ఇంటర్‌నెట్ డెస్క్: పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి నిన్న (గురువారం) ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఉదయం 10.10 గంటలకు మూడు ముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో చాలా తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది


ఈ పెళ్లిలో విజయ్, రష్మికల జంట ధరించిన పెళ్లి ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జంట ధరించిన ఆభరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రష్మిక, విజయ్ ధరించిన పెళ్లి ఆభరణాలను హైదరాబాద్‌కు చెందిన ‘శ్రీ జ్యువెలర్స్’ తయారు చేసింది. పది నెలల ముందు నుంచే ఆభరణాల తయారీ పనులు మొదలయ్యాయి.


ఆభరణాల కోసం కిలోల కొద్దీ బంగారం వాడినట్లు శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ అభిషేక్ అగర్వాల్, కౌశిక్ కుమార్ తెలిపారు. రష్మిక, విజయ్‌లు ట్రెండ్‌ను ఫాలో అవ్వలేదు. పాత దనాన్ని కోరుకున్నారు. జంట కోరిక మేరకు శ్రీ జ్యువెలర్స్ వధూవరుల పెళ్లి ఆభరణాలను భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా తయారు చేసింది. మరీ ముఖ్యంగా రాజుల కాలం నాటి డిజైన్స్‌లో ఆభరణాలను తయారు చేసింది.


రష్మిక మందన్న మొత్తం 11 ఆభరణాలు ధరించింది. మెడ హారాలు, ఝుంకాలు, జడ బిళ్ల, చంపసరలు, మాతా పట్టి, ముక్కుపుడక, హత్‌పూల్, గాజులు, వంకీలు, వడ్డాణం, బాసికం ఆమె ధరించిన వాటిలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ ధరించిన వాటిలో మెడ హారాలు, చేతి కడియాలు, వడ్డాణం, పెద్ద పెద్ద కమ్మలు, ఉంగరాలు, బాసికం ఉన్నాయి. ప్రతీ నగపై అద్భుతంగా నగిషీలు చెక్కి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. విషయం ఇదే

Updated Date - Feb 27 , 2026 | 04:09 PM