ఆహారం పెట్టబోతే ప్రాణం తీసిన ఏనుగు..
ABN , Publish Date - Jul 26 , 2026 | 06:09 PM
మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. తొండంతో నేలకేసి కొట్టి చంపేసింది. ఏనుగుకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. తొండంతో నేలకేసి కొట్టి చంపేసింది. ఏనుగుకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించగా ఈ విషాదం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన జైన్ కమ్యూనిటీ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఉజ్జయిని నుంచి ఇండోర్‌కు ఓ ఏనుగును తీసుకువచ్చింది. విరాళాల కోసం ఆ ఏనుగును వీధుల్లో తిప్పసాగారు.
శనివారం సాయంత్రం ఏనుగు వీధుల్లో తిరుగుతున్న సమయంలో రాజ్ నగర్, ఈ సెక్టార్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తి ఏనుగు దగ్గరకు వచ్చాడు. దానికి బెల్లం తినిపించడానికి ప్రయత్నించాడు. అది వింతగా ప్రవర్తించడంతో బెల్లాన్ని మావటి వ్యక్తికి ఇచ్చాడు. అయితే, ఆ ఏనుగు విజయ్‌పై ఉన్నట్టుండి దాడి చేసింది. అతడిని తొండంతో పట్టుకుని నేలకేసి కొట్టింది. ఏనుగు దాడిలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన సమయంలో విజయ్ తాగి ఉన్నాడని పోలీసులు తేల్చారు. మావటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చేంజర్ కాబోతున్న బుల్లెట్ ట్రైన్లు: కిషన్ రెడ్డి