Share News

ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. అయినా సాదాసీదా జీవితం.. భారతీయ టెకీ వీడియో వైరల్..

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:19 PM

అమెరికాలో ఏడాదికి రూ.2 కోట్లకు పైగా సంపాదిస్తున్న ఓ భారతీయ టెకీ తన రోజువారీ జీవితం గురించి వెల్లడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. అయినా సాదాసీదా జీవితం.. భారతీయ టెకీ వీడియో వైరల్..
Indian Techie US Salary

అమెరికాలో ఏడాదికి రూ.2 కోట్లకు పైగా సంపాదిస్తున్న ఓ భారతీయ టెకీ తన రోజువారీ జీవితం గురించి వెల్లడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంటెంట్ క్రియేటర్ పీయూష్ మూంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ వ్యక్తి.. అధిక ఆదాయం ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవనశైలికి దూరంగా ఉంటున్నానని తెలిపాడు (Indian Techie US Salary).


తనకు టెలీకమ్యూనికేషన్స్ వైర్‌లెస్ పరిశ్రమలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉందని, గత ఆరు సంవత్సరాలుగా ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని ఆ టెకీ చెప్పాడు. ప్రస్తుతం తన వార్షిక ఆదాయం 2 లక్షల నుంచి 3 లక్షల డాలర్ల మధ్య ఉంటుందని వెల్లడించాడు. అంటే భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.1.7 కోట్ల నుంచి రూ.2.6 కోట్ల మధ్య ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న డబ్బును ఎలా ఖర్చు చేస్తారనే ప్రశ్నకు అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు (NRI Rs 2 Crore Salary).


పిల్లలతో సమయం గడపడం, కుటుంబ అవసరాలపై ఖర్చు చేయడం తనకు ముఖ్యమని ఆ టెకీ పేర్కొన్నాడు. అలాగే స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులతో పాటు భవిష్యత్తు కోసం సంపదను పొదుపు చేస్తానని తెలిపాడు. అలాగే అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం తనకు ఎంతో ఇష్టమని, ప్రయాణాల కోసం కూడా కొంత మొత్తాన్ని కేటాయిస్తానని చెప్పాడు. ఖరీదైన కార్లు, విలాస వస్తువుల కంటే కుటుంబ అనుభవాలు, పెట్టుబడులు, ప్రయాణాలకే ప్రాధాన్యం ఇస్తానని వివరించాడు (Techie Spending Habits).


తాను తన బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు రెండింటినీ న్యూయార్క్‌లోనే పూర్తి చేసినట్లు తెలిపాడు (Indian Professionals Abroad). ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో 52,600కు పైగా వీక్షణలను పొందింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు టెకీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అధిక ఆదాయం వచ్చినా ఖర్చుల విషయంలో క్రమశిక్షణ పాటించడం, దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్యమని కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..


బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Jun 10 , 2026 | 05:52 PM