పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇష్టమట..
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:08 AM
ప్రస్తుతం పొట్ట లేకుండా సిక్స్ ప్యాక్‌తో ఉన్న వారే హీరోలు. చాలా మంది పొట్ట తగ్గించుకోవడం కోసం రకరకాల డైటింగ్‌లు, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. పొట్టను చిన్న చూపు చూస్తుంటారు. అయితే పొట్టను పౌరుషానికి చిహ్నంగా, అందానికి కొలమానంగా భావించే ఓ తెగ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రస్తుతం పొట్ట లేకుండా సిక్స్ ప్యాక్‌తో ఉన్న వారే హీరోలు. చాలా మంది పొట్ట తగ్గించుకోవడం కోసం రకరకాల డైటింగ్‌లు, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. పొట్టను చిన్న చూపు చూస్తుంటారు. అయితే పొట్టను పౌరుషానికి చిహ్నంగా, అందానికి కొలమానంగా భావించే ఓ తెగ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇథియోపియా అడవుల్లోని ఒక తెగకు చెందిన వారు పొట్ట ఉన్న పురుషులను అందంగా, శక్తిమంతుడిగా పరిగణిస్తారు (Big belly men Ethiopia).
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలోని ఓమి లోయలో నివసించే బోడి తెగ ఆచారం ప్రకారం.. బొద్దుగా, ముందుకు పొడుచుకు వచ్చే పొట్టలే పురుషులకు నిజమైన గౌరవాన్ని తీసుకువస్తాయి. ఈ తెగ ప్రతి సంవత్సరం 'కేల్ పండుగ'ను జరుపుకుంటుంది. ఇది పెద్ద పొట్టలు ఉన్నవారి కోసం నిర్వహించే ఒక ప్రత్యేకమైన పోటీ. అమ్మాయిలు ఈ జాతర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ పోటీ విజేతను తెగలోనే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా పరిగణించి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఆసక్తి చూపుతారట (Ethiopia marriage culture).
ఈ టైటిల్ గెలవడానికి, అక్కడి పురుషులు కఠోర శ్రమ చేస్తారు. పోటీకి ఆరు నెలల ముందు నుంచి వారు ఒక గుడిసెకే పరిమితమవుతారు. ఆ సమయంలో, వారు ఎలాంటి బరువైన పనులు చేయరు. వారి ఆహారం ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. ప్రతిరోజు పొట్ట పగిలేంత ఎక్కువగా తింటారు. ఇక, తమ కడుపులను బెలూన్లలా ఉబ్బించే అద్భుత శక్తిని కలిగిన ఓ ప్రత్యేకమైన 'ఎనర్జీ డ్రింక్'ను రోజూ తాగుతారు. శరీరానికి శ్రమ కలిగించకుండా తినడం, తాగడమే పనిగా పెట్టుకుంటారు (Ethiopian traditions marriage).
పండుగ రోజున, పురుషులు తమ శరీరాలకు బూడిద, బురద పూసుకుని నృత్యం చేస్తారు (Beauty standards Ethiopia). తెగ పెద్దలు అందరి పొట్టలను కొలుస్తారు. ఎవరికి పెద్ద పొట్ట ఉంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. టైటిల్ గెలవడం ఆ వ్యక్తికి సమాజంలో ఉన్నత హోదాను కల్పిస్తుంది. తెగలోని అత్యంత అందమైన స్త్రీలు అతడిని వివాహం చేసుకోవడానికి పోటీపడతారు. ఈ సాంప్రదాయం ఆ తెగలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. అందానికి ఒకే ప్రమాణం అంటూ ఏదీ లేదని బోడి తెగ వారి ఈ ఆచారాలు నిరూపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. తిరస్కరించిన ఇరాన్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..