Share News

రూ.1.27 కోట్ల ఆదాయం.. అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. యువకుడి షరతు

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:15 PM

తను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఓ యువకుడు పెట్టిన కండీషన్ మాట్రిమోనియల్ నిర్వాహకులను ఒకింత ఆశ్చర్యపరిచింది.

రూ.1.27 కోట్ల ఆదాయం.. అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. యువకుడి షరతు
IIT Graduate's Unique Marriage Conditions

ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీలో చదివి ప్రస్తుతం రూ.1.27 కోట్ల వార్షిక ఆదాయం ఆర్జిస్తున్న ఓ వ్యక్తి పెళ్లి కోసం మాట్రిమోనియల్ సంస్థను ఆశ్రయించాడు. అయితే, తను పెళ్లాడబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి అతడు చెప్పింది విని మాట్రిమోనియల్ వారే ఒకింత ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

గురుగ్రామ్‌లోని నాట్‌డేటింగ్ అనే మాట్రిమోనియల్ సైట్ సీఈఓ జస్వీర్ సింగ్ తన వద్దకు సంబంధాల కోసం వచ్చిన ఆ యువకుడు పెట్టిన కండీషన్స్ గురించి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గ్రామంలో పుట్టి, సిటీకొచ్చి తనకంటూ అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్న యువతినే పెళ్లాడతానని ఆ యువకుడు చెప్పినట్టు జస్వీర్ సింగ్ తెలిపారు.


ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువకుడు గతంలో నగరాల్లో సంపన్న కుటుంబాలకు చెందిన యువతులతో డేటింగ్ చేశాడు. గ్రామీణ నేపథ్యంలో ఉన్న యువతులను పరిశీలించాడు. కానీ ఇద్దరి నేపథ్యాలు తనకు అనుకూలంగా లేవన్న అంచనాకు వచ్చాడు. సంపన్న మహిళల బాల్యం, తన బాల్యం మధ్య ఉన్న వ్యత్యాసాల కారణంగా అభిరుచుల్లో మౌలికమైన తేడాలు ఉన్నాయని చెప్పాడు. అలాంటి వారితో జీవితం పంచుకోలేనని అన్నాడు.

ఇక గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన వారు తన అభివృద్ధి ప్రణాళికలు, ప్రస్తుతం తాను నిర్మించుకున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని యువకుడు చెప్పాడు. కాబట్టి ఈ రెండు నేపథ్యాలను చూసిన యువతినే పెళ్లి చేసుకోవాలని తాను భావిస్తున్నట్టు అతడు తెలిపాడు. ఆ యువకుడు కేవలం డబ్బున్న, అందమైన అమ్మాయిలను మాత్రమే కోరుకోవడం లేదని జస్వీర్ సింగ్ వివరించారు. తనలాంటి జీవితానుభవాలు చూసిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నాడని అన్నారు. ఈ పోస్టుపై పెద్ద ఎత్తున స్పందించిన జనాలు యువకుడి అభిప్రాయాలు సబబుగానే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. పెళ్లికి ముందుకు యువతీయువకుల అభిరుచులు, అభిప్రాయాలు ఎంత కలిసినా వారి వైవాహిక బంధం కలకాలం నిలబడాలంటే ఇద్దరికీ సర్దుబాటు ధోరణి తప్పదని మరికొందరు తేల్చి చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

బైకర్ నిర్లక్ష్యం.. క్షణాల్లో భయంకర ప్రమాదం.. వీడియో వైరల్

బైకర్ నిర్లక్ష్యం.. క్షణాల్లో భయంకర ప్రమాదం.. వీడియో వైరల్

Updated Date - Nov 25 , 2026 | 01:32 PM