ఛీ.. ఛీ.. ఇదెక్కడి వింత అలవాటు.. భర్త సీక్రెట్ బయటపడడంతో భార్య ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:48 PM
ఈ ప్రపంచంలో చాలా మందికి రకరకాల అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల వల్ల ఇతరులకు ఇబ్బంది లేనంత వరకూ పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే కొందరికి మాత్రం బయటకు చెప్పుకోలేని వింత అలవాట్లు ఉంటాయి. అలాంటి ఓ విచిత్రమైన అలవాటు వల్ల ఓ భర్త తన భార్యకు దూరమయ్యాడు.
ఈ ప్రపంచంలో చాలా మందికి రకరకాల అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల వల్ల ఇతరులకు ఇబ్బంది లేనంత వరకూ పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే కొందరికి మాత్రం బయటకు చెప్పుకోలేని వింత అలవాట్లు ఉంటాయి. అలాంటి ఓ విచిత్రమైన అలవాటు వల్ల ఓ భర్త తన భార్యకు దూరమయ్యాడు. యూకేకు చెందిన ఓ వ్యక్తి తన విచిత్రమైన అలవాటు వల్ల 30 ఏళ్లు కలిసి ఉన్న తన భార్యను దూరం చేసుకున్నాడు (husband bad habit).
యూకేకు చెందిన ఓ వ్యక్తికి మహిళల లో దుస్తులు దొంగిలించే అలవాటు ఉంది. తన ఇరుగు పొరుగు మహిళలు, స్నేహితుల భార్యలు ఉపయోగించిన లో దుస్తులను దొంగిలించి వాటిని ఇంటికి తీసుకెళ్లి దాచుకునే వాడు. అలా అతడి ఇంట్లో భార్యకు తెలియకుండా ఇతర మహిళల లో దుస్తులను దాస్తున్నాడు. ఇటీవల అవి అతడి భార్య కంటపడ్డాయి. దీంతో భార్య అతడిని నిలదీయగా తాను చేస్తున్న పని గురించి చెప్పాడు. షాక్‌కు గురైన భార్య అతడికి విడాకుల నోటీసులు పంపించింది (marriage ruined after 30 years).
తన భర్త లో దుస్తుల వ్యసనం గురించి తనకు తెలుసునని, కానీ అది ఇంత దూరం వెళ్తుందని ఎప్పుడూ ఊహించలేదని ఆ మహిళ చెబుతోంది (shocking marriage story). తన భర్త అంటే తనకు అసహ్యం వేస్తోందని, అది భావోద్వేగపరమైన ద్రోహం అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నమ్మకం, గౌరవం, గోప్యత ఏ వివాహానికైనా పునాది అని, తమ వైవాహిక జీవితంలో అవి లేవని తేలిన తర్వాత విడాకులు తీసుకోవడమే తన ముందున్న దారి అని ఆమె పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి.. కారణమేంటో తెలుసా?
సరికొత్తగా అమెరికా స్వరూపం.. కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనెజువెలాతో కూడిన మ్యాప్‌ను షేర్ చేసిన ట్రంప్..