వామ్మో.. హిప్పోకు ఎంత బలముందో చూశారా.. నదిలో పడవ పరిస్థితి చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:40 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ హిప్పోకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Hippo flips boat).
@InsaneReality అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. నిశ్చలంగా ఉన్న నదిలో రెండు పడవలు నెమ్మదిగా వెళ్తున్నాయి. చూడడానికి అంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. అయితే ఉన్నట్టుండి ఆ పడవల దగ్గరకు ఓ హిప్పో వచ్చింది. అది తన బలం మొత్తం ఉపయోగించి ఆ పడవను పైకి లేపేసింది. దీంతో ఆ పడవ బోల్తా పడింది. ఆ పడవలో ఉన్న వ్యక్తి నీటిలో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు (South Africa wildlife incident).
నీటిలో పడిపోయిన ఆ వ్యక్తిపై హిప్పో దాడికి దిగకపోడంతో అతడు బతికిపోయాడు (Hippopotamus attack video). దక్షిణాఫ్రికాలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 45 వేల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. హిప్పోకు అంత కోపం ఎందుకు వచ్చిందోనని ఒకరు కామెంట్ చేశారు. 'హిప్పోలకు అంత బలముంటుందా' అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఇవి కూడా చదవండి..
ఇదెక్కడి పిచ్చి బ్రదర్.. రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడతారా..
మీ కళ్ల షార్ప్‌నెస్‌కు టెస్ట్.. ఈ పార్క్‌లో పుస్తకం ఎక్కడుందో 13 సెకెన్లలో గుర్తించండి..