పుట్టగానే దూరం పెట్టిన తల్లి.. కన్నీళ్లు పెట్టిస్తున్న కోతి కథ..
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:01 PM
జపాన్‌లోని ఓ జూలో ఉంటున్న కోతి పిల్ల ఇప్పుడు ఇంటర్‌నేషనల్ సెలెబ్రిటీ అయిపోయింది. పంచ్ అని ముద్దుగా పిలుచుకునే ఈ కోతి పిల్ల స్టోరీ తెలిసిన జనాలు.. అయ్యో పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..
ఇంటర్‌నెట్ డెస్క్: జపాన్‌కు చెందిన ఓ కోతి పిల్ల సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అది సోషల్ మీడియా సెలెబ్రిటీ అయిపోవడానికి వింత వింత పనులేమీ చేయలేదు. విషాదకరమైన పుట్టుకే.. దాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. దాని స్టోరీ తెలిసిన జనాలు.. అయ్యో పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..
పంచ్ కన్నీటి కథ ఏంటంటే..
పంచ్ కున్ (ముద్దుగా పంచ్) అనే ఈ కోతి పిల్ల 2025 జులైలో జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో జన్మించింది. పుట్టిన కొద్దిసేపటికే తల్లి పంచ్‌ను దూరం పెట్టింది. మళ్లీ దగ్గరకు తీసుకోలేదు. అప్పుడే పుట్టిన కోతి పిల్లలు తల్లుల్ని అంటిపెట్టుకుని ఉండటం వల్ల,. భద్రత, వెచ్చదనంతో పాటు ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది. అయితే ఈ కోతి పిల్లను తల్లి దూరం పెట్టడంతో జూ సిబ్బంది 24 గంటలూ.. పంచ్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎమోషనల్‌గా దెబ్బతినకుండా ఉండటానికి బ్లాంకెట్స్, బొమ్మలు ఇచ్చారు.
పంచ్ ఒరంగుటాన్ బొమ్మను తనతో పాటు పెట్టుకుంది. ఆ బొమ్మతోటే అటు, ఇటు తిరుగుతూ ఉంది. పంచ్ బొమ్మతో తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జూకు జనం క్యూ కడుతున్నారు. జూకు వచ్చే జనంలో ఎక్కువ శాతం పంచ్‌ను చూడ్డానికే వస్తున్నారు. పంచ్ బాధాకరమైన స్టోరీ తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంచ్ ఉండే ఎన్‌క్లేవ్‌కు జనం తాకిడి పెరగటంతో.. గంటలు, గంటలు క్యూలైన్‌లో నిలబడి మరీ పంచ్‌ను చూడాల్సి వస్తోంది. జనం ఎంతో ఓపిగ్గా వేచి ఉండి మరీ దాన్ని చూసి వెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి..
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. పతనానికి కారణాలు ఇవేనా..