కంటతడి పెట్టిస్తున్న తల్లి కోతి వీడియో.. చనిపోయిన బిడ్డను పట్టుకుని..
ABN , Publish Date - Jun 16 , 2026 | 08:02 AM
ఓ కోతి చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని ఒళ్లో పెట్టుకుని ఊరంతా తిరిగింది. బిడ్డ చనిపోయిందన్న విషయం తెలియక కళేబరాన్ని ముద్దులాడుతూ.. నాకుతూ లేపడానికి ప్రయత్నించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఏదీ ఉండదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తల్లి తన బిడ్డను ప్రాణంగా చూసుకుంటుంది. బిడ్డకు ఏమైనా అయితే తట్టుకోలేదు. కేవలం మనుషులు మాత్రమే కాదు.. ఏ జీవి అయినా తల్లి ప్రేమలో మార్పు ఉండదు. ఇందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఓ కోతి చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని ఒళ్లో పెట్టుకుని ఊరంతా తిరిగింది. బిడ్డ చనిపోయిందన్న విషయం తెలియక కళేబరాన్ని ముద్దులాడుతూ.. నాకుతూ లేపడానికి ప్రయత్నించింది.
స్థానిక జనం ఇది చూసి కంటతడి పెట్టుకున్నారు. ఔరైయా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తల్లి కోతి చనిపోయిన బిడ్డను లేపడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీశారు. ఉమేశ్ అవస్థీ అనే వ్యక్తి ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు. వీడియో చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి’.. ‘ఇలాంటి దృశ్యాలు చూసినపుడు నాకు కన్నీళ్లు ఆగవు’..‘తల్లి ప్రేమకు జోహార్లు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు
యుద్ధం ముగియడంతో పసిడికి మళ్లీ డిమాండ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..