Share News

యుద్ధం ముగియడంతో పసిడికి మళ్లీ డిమాండ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 16 , 2026 | 06:58 AM

పశ్చిమాసియా యుద్ధం ముగిసిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్స్‌ను పెంచదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో, ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

యుద్ధం ముగియడంతో పసిడికి మళ్లీ డిమాండ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rates on Jun 16 in India

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయి. దీంతో, వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ పెంచే అవకాశాలు తక్కువని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. తమ పెట్టుబడులను యూఎస్ ట్రెజరీ బాండ్‌ల నుంచి మరింత లాభదాయకమైన బంగారం వైపు మళ్లిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయని అంటున్నారు.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (జూన్ 16) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,540గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,910ల వద్ద కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల్లో ధరలు దాదాపుగా ఇవే స్థాయిలో ఉన్నాయి. నిన్న దేశంలో మేలిమి బంగారం ధర ఏకంగా రూ.2,450ల మేర పెరిగిన విషయం తెలిసిందే.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,53,500

₹1,40,710

₹1,18,010

ముంబై

₹1,51,540

₹1,38,910

₹1,13,660

ఢిల్లీ

₹1,51,690

₹1,39,060

₹1,13,810

కోల్‌కతా

₹1,51,540

₹1,38,910

₹1,13,660

బెంగళూరు

₹1,51,540

₹1,38,910

₹1,13,660

వడోదరా

₹1,51,590

₹1,38,960

₹1,13,710

కోయంబత్తూరు

₹1,53,500

₹1,40,710

₹1,18,010

ఇండోర్

₹1,51,590

₹1,38,960

₹1,13,710

కాన్పూర్

₹1,51,690

₹1,39,060

₹1,13,810


గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంతాయి. కాబట్టి నగల కొనుగోలు సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన

ఈ వార్తలనూ చదవండి:

యుద్ధం ముగిసె.. మార్కెట్‌ మురిసె..

ఆర్థిక ఉత్పత్తుల మిస్‌ సెల్లింగ్‌కు ఆర్‌బీఐ బ్రేక్‌

Updated Date - Jun 16 , 2026 | 07:22 AM