Share News

ఆర్థిక ఉత్పత్తుల మిస్‌ సెల్లింగ్‌కు ఆర్‌బీఐ బ్రేక్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 02:01 AM

ఫైనాన్షియల్‌ మార్కెట్లో డిపాజిట్లు, మదుపరుల ప్రయోజనాల కోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరో కీలక చర్య తీసుకుంది. తప్పుడు వాగ్దానాలు, ఆశలతో బ్యాంకులు...

ఆర్థిక ఉత్పత్తుల మిస్‌ సెల్లింగ్‌కు ఆర్‌బీఐ బ్రేక్‌

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర బ్యాంకు

ముంబై: ఫైనాన్షియల్‌ మార్కెట్లో డిపాజిట్లు, మదుపరుల ప్రయోజనాల కోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరో కీలక చర్య తీసుకుంది. తప్పుడు వాగ్దానాలు, ఆశలతో బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎ్‌ఫసీ) తమ ఆర్థిక సాధనాలు, సేవలను మార్కెట్‌ చేయడాన్ని చెక్‌ పెట్టేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఇక తమ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు, ఆశలతో ఎవరి చేత తమ ఆర్థిక సాధనాలు, సేవలు కొనిపించకూడదు. అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తప్పుడు వాగ్దానాలతో కస్టమర్ల చేత బీమా పాలసీలు, డిపాజిట్లు చేయిస్తున్నాయని ఇటీవల పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ ఇందుకు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఈ దోపిడీకి చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ చర్యలకు ఉపక్రమించింది.

  • బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలతో పాటు వాటి తరపున పనిచేసే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థలకూ వర్తింపు

  • తన నియంత్రణలోని సంస్థల ఉద్యోగులకు థర్డ్‌ పార్టీలు చెల్లించే ప్రోత్సాహకాలపై నిషేధం

  • అయితే తన నియంత్రణలోని సంస్థలు తమ ఉద్యోగులకు చెల్లించే ప్రోత్సాహకాలపై మాత్రం ఎటువంటి నిషేధం ఉండదు

  • ప్రోత్సాహకాల ద్వారా భారీగా జరుగుతున్న ఆర్థిక సాధనాలు, సేవల మిస్‌ సెల్లింగ్‌ను నిరోధించేందుకే ఈ చర్యలు

ఇవి కూడా చదవండి..

ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..

Updated Date - Jun 16 , 2026 | 02:01 AM