కుక్క కోసం ప్రాణాలకు తెగించిన యువతి.. మంటల్ని లెక్క చేయకుండా..
ABN , Publish Date - Mar 25 , 2026 | 06:30 PM
ఓ యువతి మంటల్లో చిక్కుకున్న కుక్క కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఏ మాత్రం భయపడకుండా మంటల్లోకి వెళ్లి దాన్ని కాపాడింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: మంటల్లో చిక్కుకున్న కుక్క కోసం ఓ యువతి తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఏ మాత్రం భయపడకుండా మంటల్లోకి వెళ్లి దాన్ని కాపాడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వేర్‌హౌస్‌లో ఉండే కుక్క మంటల్లో చిక్కుకుపోయింది. దాన్ని కట్టేసి ఉంచటంతో అక్కడి నుంచి పక్కకు రాలేక పోయింది. వేడికి తట్టుకోలేక ప్రాణ భయంతో గట్టిగా అరవటం మొదలెట్టింది.
కుక్క అరుపులు విన్నా కూడా చాలా మంది మంటలకు భయపడి దాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కానీ, ఓ యువతి మాత్రం ధైర్యం చేసింది. కుక్కను కాపాడ్డానికి మంటలను కూడా లెక్కచేయలేదు. లోపలి వెళ్లి అతి కష్టం మీద దాన్ని విడిపించి తీసుకువచ్చింది. అయితే, అప్పటికే దానికి మంటల కారణంగా గాయాలు అయ్యాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది. కుక్కను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువతిని స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ యువతికి కచ్చితంగా అవార్డు ఇవ్వాలి. కుక్క కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. కొంచెం అటు, ఇటు అయినా ఆమె ప్రాణాలు పోయేవి’..‘మూగ జీవాల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు’..‘పాపం.. ఆ కుక్కను చూస్తే జాలేస్తోంది. భయంతో మూగబోయింది’..‘ఆ అమ్మాయి లేకపోతే ఆ కుక్క పరిస్థితి ఘోరంగా ఉండేది. నిజంగా ఆమె ఓ దేవత’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బయటపడిన కోటక్ బ్యాంక్ మోసం.. మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత సురక్షితం..
వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు: వైఎస్ షర్మిల