Gender change story: ఇద్దరు పిల్లల తండ్రి.. ఏడేళ్ల తర్వాత భార్యకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే..
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:43 AM
అతడు వివాహితుడు.. ఏడు సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. రెండేళ్ల క్రితం భార్యతో గొడవపడి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు.. తాజాగా అతడి భార్యకు షాకింగ్ విషయం తెలిసింది..
అతడు వివాహితుడు.. ఏడు సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. రెండేళ్ల క్రితం భార్యతో గొడవపడి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు.. తాజాగా అతడి భార్యకు షాకింగ్ విషయం తెలిసింది.. అతడు రెండేళ్ల క్రితం ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి చికిత్స చేయించుకుని మహిళగా మారిపోయాడని తెలిసి షాకైన ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సంచలనంగా మారింది (hidden gender transition).
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన బాధిత మహిళకు ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆమె భర్త ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. అంతకు ముందే భార్యతో గొడవపడి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఇటీవల ఆమె భర్తకు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను చూసి షాకైంది. వెంటనే కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌లో ఆమె షాకింగ్ విషయాలు వెల్లడించింది (father underwent gender change).
వివాహం అయినప్పటి నుంచి తన భర్త ప్రవర్తన అసాధారణంగా ఉండేదని, తరచూ తనను మానసికంగా హింసించేవాడని ఆరోపించింది (shocking family secret). భర్త తన మగ స్నేహితులతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను కూడా అలాగే చేయమని బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది. రెండేళ్ల క్రితం తనపై దారుణంగా దాడి చేసి ఇంటి నుంచి గెంటేశాడని, తన పిల్లల భవిష్యత్తు గురించి తాను ఆందోళన చెందుతున్నానని బాధితురాలు పేర్కొంది. భర్త నుంచి భరణం కోరుతూ పిటిషన్ వేసింది. అయితే తన భార్య చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని భర్త చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..