ఏనుగును చూసి మొరిగిన కుక్క.. తర్వాత ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jan 25 , 2026 | 10:01 PM
జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు, కుక్కకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు, కుక్కకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
lek_chailert అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఏనుగులు గుంపుగా ఉన్నాయి. అక్కడ ఒక తెల్లటి కుక్క కూడా ఉంది. ఆ కుక్క ఏనుగును చూసి మొరగడం ప్రారంభించింది. కానీ, ఆ కుక్కను గజరాజు మొదట్లో పట్టించుకోలేదు. అయితే ఆ కుక్క మాత్రం ఏనుగు మీదకు వస్తూ పదే పదే మొరిగింది. దాంతో చిర్రెత్తిన ఏనుగు తన వెనుక కాలితో ఆ కుక్కను ఎగిరి తన్నేందుకు ప్రయత్నించింది.
దూరంగా వెళ్లిన కుక్క మళ్లీ అరవడం ప్రారంభించింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు తొండం ఎత్తి కుక్కపై ప్రతాపం చూపేందుకు ప్రయత్నించింది. దీంతో కుక్క సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. దాదాపు మూడు లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న ముగ్గురిని 10 సెకెన్లలో కనిపెట్టండి..
వార్నీ.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. గోధుమలను ఎలా ఆరబెడుతోందో చూడండి..