Share News

సంతానానికి ఆస్తులు.. ఆ తప్పు మాత్రం చేయను: ఎలాన్ మస్క్

ABN , Publish Date - Jun 13 , 2026 | 02:14 PM

తన కంపెనీల బాధ్యతలను నేరుగా పిల్లలకు అప్పగించనని అపరకుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా నాయకత్వ బదిలీ జరగాలని చెప్పారు.

సంతానానికి ఆస్తులు.. ఆ తప్పు మాత్రం చేయను: ఎలాన్ మస్క్
Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. స్పేస్‌ఎక్స్ ఐపీఓతో ఆయన తొలి ట్రిలియనీర్‌గా మారారు. అయితే, తన తదనంతరం ఈ ఆస్తులను నేరుగా పిల్లలకు ఇచ్చేది లేదని మాత్రం ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఇటీవల ఒక అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.

పెద్దలు నేరుగా సంతానానికి తమ కంపెనీల్లో వాటాలు, నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలన్న వాదనను తాను సమర్థించనని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. సంపద, నాయకత్వం అనేది కుటుంబసంబంధాల ఆధారంగా బదిలీ చేయకూడదని స్పష్టం చేశారు. పిల్లలకు ఆసక్తి, నైపుణ్యాలు లేనప్పుడు బాధ్యతలు, ఆస్తులను అప్పగించకూడదని తేల్చి చెప్పారు.


వారసత్వం కంటే వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా కంపెనీల బాధ్యతలను తదుపరి తరాలకు అప్పగించాలని ఎలాన్ మస్క్ గతంలో అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తను లేనప్పుడు కూడా కంపెనీలను సమర్థవంతంగా నిర్వహించే వారికే తన కంపెనీల బాధ్యతలు అప్పగిస్తానని మస్క్ చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే తన దృష్టిలో కొందరు ఉన్నారని చెప్పినప్పటికీ వారి పేర్లను మాత్రం ఆయన ఎన్నడూ బయటపెట్టలేదు. మస్క్‌కు 13 మంది సంతానం ఉన్న విషయం తెలిసిందే. వారికి ఆస్తిని ఇచ్చే విషయమై మస్క్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.


ఈ వార్తలనూ చదవండి

యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ చరిత్ర.. 50 కోట్ల సబ్‌స్క్రైబర్లు దాటేశాడు..

బెడిసి కొట్టిన స్టంట్ షో.. యువకుడి ప్రాణం పోయింది..

Updated Date - Jun 13 , 2026 | 02:27 PM