Share News

వీడియో కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి.. ఎందుకా సాహసం?..

ABN , Publish Date - May 31 , 2026 | 07:30 AM

ఓ వ్యక్తి 7వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి వేలాడుతూ .. పక్కింట్లోని దృశ్యాలను వీడియో చిత్రీకరించాడు. ఆ వ్యక్తి ప్రాణాలను రిస్క్ చేసి.. కిటికీని పట్టుకు వేలాడుతూ ఆ వీడియో తీశాడు.

వీడియో కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి.. ఎందుకా సాహసం?..
elderly man viral video

ఇంటర్‌నెట్ డెస్క్: ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలీదు కానీ.. ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందటే.. ఓ వ్యక్తి 7వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి వేలాడుతూ .. పక్కింట్లోని దృశ్యాలను వీడియో చిత్రీకరించాడు. ఆ వ్యక్తి ప్రాణాలను రిస్క్ చేసి.. కిటికీని పట్టుకు వేలాడుతూ ఆ వీడియో తీశాడు. వీడియో చిత్రీకరించటం అయిపోగానే.. కిటికీ దగ్గర కూర్చుని వీడియోను చూశాడు. దూరంగా వేరే బిల్డింగ్‌లో ఉన్న వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియోను రుద్ర యాదవ్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.


‘ఈ వ్యక్తిని చూడండి. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా.. పక్కింట్లో జరుగుతున్న గొడవను వీడియో తీయడానికి కిటికీ నుంచి వేలాడుతున్నాడు. నిజానికి పక్కింట్లో గొడవ జరుగుతుండగా, అక్కడి శబ్దాలు స్పష్టంగా వినిపించలేదు. ఆసక్తి ఆపుకోలేక, ఆయన నేరుగా భవనం కిటికీ నుంచి వేలాడుతూ ఆ గొడవను వీడియోగా రికార్డ్ చేయడం ప్రారంభించాడు’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకన్న ముందు నా సోదరినే అనుకున్నారు..

Updated Date - May 31 , 2026 | 07:35 AM