ఈజిప్ట్ పిరమిడ్‌పై బొమ్మ గీశాడు.. అరెస్ట్ అయ్యాడు..
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:44 PM
పర్యాటకులకు తప్పుఒప్పులు ఏవో చెప్పాల్సిన ఓ గైడ్ పిచ్చి పని చేశాడు. ఏకంగా పిరమిడ్‌పై బొమ్మలు గీశాడు. ఇదే అతడి కొంపముంచింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఈజిప్ట్ పిరమిడ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన పిరమిడ్లను చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈజిప్ట్ వెళ్తుంటారు. లోకల్ గైడ్ల సాయంతో అక్కడి ప్రదేశాలు చుట్టి వస్తుంటారు. పర్యాటకులకు తప్పుఒప్పులు ఏవో చెప్పాల్సిన ఓ గైడ్ పిచ్చి పని చేశాడు. ఏకంగా పిరమిడ్‌పై బొమ్మలు గీశాడు. ఇదే అతడి కొంపముంచింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సక్కారలో 4 వేల ఏళ్ల చరిత్ర కలిగిన యూనస్ పిరమిడ్ ఉంది. సోమవారం ఓ గైడ్ ఆ పిరమిడ్‌పై బొమ్మలు గీశాడు.
దీన్ని అక్కడున్న యాంటిక్విటీస్ ఇన్‌స్పెక్టర్ వీడియో తీశాడు. సక్కార టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. గైడ్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ యాంటిక్విటీస్ సోమవారం స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. పిరమిడ్ రాయిపై గీసిన బొమ్మలను గైడ్ తుడిచేయడానికి ప్రయత్నించాడు. యాంటిక్విటీస్ ఇన్‌స్పెక్టర్ గైడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వారి వల్లే పర్యాటక ప్రదేశాలు నాశనం అవుతున్నాయి. వాళ్లను ఊరికే వదిలిపెట్ట కూడదు’..‘అన్నం పెట్టే చెయ్యిని నరకటం అంటే ఇదే.. మరీ ఇంత దారుణంగా ఉన్నాడేంటి?’.. ‘పిరమిడ్ లోపల ఉన్న మహారాజు ఆత్మ నిన్ను వదిలిపెట్టదు. నీకు శాపం తగులుతుంది’..‘4 వేల ఏళ్ల చరిత్రను ఇలా నాశనం చేస్తున్నావేంటి పెద్ద మనిషి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
టీ20 ఆడాల్సిన పద్ధతి ఇది కాదు: సునీల్ గావస్కర్ ఫైర్
దేశాన్ని అమ్మేశారు.. మళ్లీ రాహుల్ నోట అదే మాట