ఇదేం పైత్యం రా నాయనా! ఇరాన్ దాడుల వీడియోతో యాడ్స్!
ABN , Publish Date - Mar 06 , 2026 | 06:18 PM
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల వీడియోను ప్రచారం కోసం వాడుకుంటున్న ఓ రెస్టారెంట్ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రపంచమంతటా కలకలం రేపుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు చేస్తుంటే ఇరాన్ కూడా అదే స్థాయిలో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్స్‌తో విరుచుకుపడుతోంది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడుల వీడియోతో ఒక రెస్టారెంట్ యాజమాన్యం తమ సంస్థకు ప్రచారం కల్పించాలని చూడటం విమర్శలకు దారి తీసింది.
మీడియా కథనాల ప్రకారం, ఈజిప్ట్‌లోని ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ హాటీ అహ్మద్ నాడా ఇలాంటి ప్రచారానికి దిగినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడుల వీడియోను తనకు అనుకూలంగా వాడుకుంది. వీడియోలో మొదట ఇరాన్ క్షపణి దాడితో మంటలు చెలరేగిన వైనం కనిపిస్తుంది. ఆ మరుక్షణం మూకుడులో ఫుడ్‌పై జ్వాలలు కనిపిస్తాయి. ఇలా ఊహించని రీతిలో యుద్ధ దృశ్యాలను వాడుకుని తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల మధ్య 1948, 1956, 1967, 1973లో యుద్ధాలు జరిగాయి. ఆ తరువాత 1979లో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తొలి అరబ్ దేశంగా ఈజిప్ట్ నిలిచింది. నాడు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ కొన్నాళ్ల తరువాత హత్యకు గురయ్యారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అనేక రంగంలో సహకారం కొనసాగుతున్నా ఈ ఒప్పందంపై మాత్రం ఈజిప్టులో అసంతృప్తి గళాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ వార్తలూ చదవండి:
చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో
ఫ్రెండ్స్ వద్దంటున్నా భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా యువతి! చివరకు..