Share News

కూల్ డ్రింక్‌లో బల్లి.. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - May 12 , 2026 | 07:01 AM

తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన కూల్ డ్రింక్ తాగే వారిని భయానికి గురి చేస్తోంది. 20 రూపాయల కూల్‌ డ్రింక్ బాటిల్‌లో కుళ్లిన స్థితిలో బల్లి వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కూల్ డ్రింక్‌లో బల్లి.. వైరల్‌గా మారిన వీడియో..
lizard in Thums Up bottle

ఇంటర్‌నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో జనం ఎక్కువగా శీతల పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. కూల్ డ్రింక్ తాగి ఎండ వేడి నుంచి చిల్ అవుతున్నారు. అయితే, తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన కూల్ డ్రింక్ తాగే వారిని భయానికి గురి చేస్తోంది. 20 రూపాయల కూల్‌ డ్రింక్ బాటిల్‌లో కుళ్లిన స్థితిలో బల్లి వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జేఎన్‌యూ స్టూడెంట్స్ ఎక్స్ ఖాతా ఈ వీడియోను షేర్ చేసింది.


‘ఓ వ్యక్తి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కొన్నాడు. బాటిల్ ఓపెన్ చేయడానికి ముందు అందులో ఏదో ఉందని గుర్తించాడు. కూల్ డ్రింక్‌ను బయటకు పోయగా.. బల్లి బయటపడింది. అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు’ అని రాసుకొచ్చింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి అప్పుడే కొన్న కూల్ డ్రింక్ బాటిల్‌లో ఏదో ఉందని గుర్తించాడు. బాటిల్ మూత తీసి అందులోని డ్రింక్‌ను ఓ పాత్రలో పోశాడు. కూల్ డ్రింక్‌లో ఏదో తేలియాడుతూ కనిపించింది. పక్కన ఉన్న వ్యక్తి చిన్న పుల్ల సాయంతో కూల్ డ్రింక్‌లో ఉన్న దాన్ని బయటకు తీశాడు.


సోషల్ మీడియాలో ఈ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘అది బల్లి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎంత కుళ్లిపోతే మాత్రం అలా పాల మీద మీగడలా తయారు అవుతుందా?’.. ‘ఇది ఫేక్ వీడియో. ఇలాంటి వాటిని నమ్మకూడదు’..‘ఇలాంటివి చూసినపుడు బయట తినుబండారాలు కొనాలంటే భయం వేస్తుంది’.. ‘కూల్ డ్రింక్‌లో ఏ జీవిపడ్డా అలానే అవుతుంది. ఎందుకంటే అన్ని కూల్ డ్రింక్స్ ఎసిడిక్ నేచర్‌ను కలిగి ఉంటాయి. కూల్ డ్రింక్‌లో ఎక్కువ రోజులు ఉంటే జెల్లీలాగా మారతాయి’ అంటూ మిశ్రమంగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

బంగారం ఎందుకు కొనొద్దంటే..

ఒత్తిడితో భారత్‌ను లొంగదీసుకోలేరు!

Updated Date - May 12 , 2026 | 02:05 PM