Share News

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదే!

ABN , Publish Date - Aug 27 , 2026 | 03:20 PM

ఆగస్టు 28న రక్షాబంధన్‌, పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో గ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదే!
Raksha Bandhan 2026 on Chandra Grahanam

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 28, శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇదే రోజు రక్షాబంధన్‌ పండుగ కూడా జరగనుండటంతో రాఖీ కట్టే విషయంలో చాలామందికి సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చంద్రగ్రహణం కారణంగా సూతకం ఉంటుందా? రాఖీ వేడుకలను వాయిదా వేయాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించకపోవడంతో ఆందోళన అవసరం లేదని చెప్పొచ్చు.

ఆగస్టు 28న చంద్రగ్రహణ సమయాలు

ఆగస్టు 28న ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6:53 గంటలకు ఉపచ్ఛాయా గ్రహణంతో ప్రారంభమవుతుంది. ఉదయం 8:03 గంటలకు పాక్షిక గ్రహణం మొదలవుతుంది. ఉదయం 9:43 గంటల సమయంలో గ్రహణం గరిష్ఠ స్థితికి చేరుకుంటుంది. అనంతరం ఉదయం 11:22 గంటలకు పాక్షిక గ్రహణం ముగుస్తుంది. మధ్యాహ్నం 12:32 గంటలకు ఉపచ్ఛాయా గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. అయితే గ్రహణం సంభవించే సమయానికి భారతదేశంలో చంద్రుడు ఆకాశంలో ఉండడు. అందువల్ల మన దేశం నుంచి ఈ చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం సాధ్యం కాదు.


చంద్రగ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుంది?

ఆగస్టు 28న ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్‌, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి గ్రహణం పూర్తిగా లేదా పాక్షికంగా కనిపిస్తుంది. సముద్ర ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా దీనిని వీక్షించవచ్చు.

గ్రహణం కనిపించకపోతే సూతకం ఉంటుందా?

సాధారణంగా చంద్రగ్రహణం సమయంలో సూతకం, గ్రహణకాల నియమాలు పాటించే సంప్రదాయం ఉంది. అయితే గ్రహణం మన దేశంలో కనిపించనప్పుడు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదని పలువురు పండితులు, జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టవచ్చా?

ఈ ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్‌, పౌర్ణమి, చంద్రగ్రహణం ఒకే రోజున రావడంతో రాఖీ కట్టే విషయంలో సందేహాలు ఏర్పడ్డాయి. అయితే గ్రహణం భారతదేశంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో కనిపించనందున రాఖీ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన అవసరం లేదని సంప్రదాయ విశ్వాసాల ప్రకారం నిపుణులు చెబుతున్నారు. తోబుట్టువులకు సంతోషంగా రాఖీ కట్టవచ్చని సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 27 , 2026 | 03:20 PM