కెనడాలో ఒంటరితనం తట్టుకోలేక భారత్‌కు వచ్చేశా.. వ్యక్తి వీడియో వైరల్
ABN , Publish Date - May 24 , 2026 | 10:08 PM
కెనడాలో డిప్రెషన్ బారిన పడ్డ తాను ఇక అక్కడ ఉండలేక భారత్‌కు సెల్ఫ్ డిపోర్టు చేసుకున్నానని ఒక చెన్నై వ్యక్తి పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పాశ్చాత్య దేశాల్లో తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని భారతీయ యువతీయువకులు ఆశపడతారు. కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే, అక్కడ లైఫ్ కొన్ని సవాళ్లతో కూడుకున్నదని కూడా అనేక మంది ఎన్నారైలు చెబుతుంటారు. నెట్టింట తమ అనుభవాలను పంచుకుంటారు. తాజాగా చెన్నై వ్యక్తి ఒకరు సరిగ్గా ఇదే పని చేశారు. తాను సెల్ఫ్ డిపోర్టు చేసుకుని భారత్‌కు వచ్చేశానంటూ నెట్టింట వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సుదర్శన్ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. ‘హలో.. ఎలా ఉన్నారు? నన్ను నేను భారత్‌కు సెల్ఫ్ డిపోర్టు చేసుకున్నాను. ఒంటరితనం ఉన్నప్పుడు ఎంత డబ్బున్నా ఒకటే. మరొకరితో డబ్బును పంచుకోలేనప్పుడు ఎంత డబ్బుంటే ఏం ఉపయోగం? కెనడాలో లైఫ్ డిప్రెషన్ తెచ్చేస్తుంది. సో.. చాలా కాలం తరువాత నేను తొలిసారిగా నవ్వుతున్నాను’ అని పోస్టు పెట్టారు. నా తరువాత కెనడాను వీడేదెవరు? అని కూడా ప్రశ్నించారు.
ఈ వీడియోకు సహజంగా నెట్టింట మంచి స్పందన వచ్చింది. అనేక మంది ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘నువ్వు చెప్పింది నిజమే బ్రదర్. నీవు కోరుకున్నది నీకు దక్కాలని ఆశిస్తున్నా’ ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ‘డబ్బు లేనప్పుడు ఏ దేశంలో ఉన్నా డిప్రెషనే’ అని మరొకరు అన్నారు. రెండేళ్ల క్రితం కెనడా వీడి భారత్‌కు వచ్చిన తాను ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నానని మరొక వ్యక్తి చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
మా దేశంలో ఏం చేస్తామో తెలిస్తే భారతీయులు షాకవుతారు: యూఎస్ మహిళ
జీతం పెంచమంటే గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిన సంస్థ.. తెరిచి చూస్తే..