Share News

మీ దృష్టి రేంజ్ ఎంత.. ఈ ఫొటోల మధ్యలో మూడు తేడాలను 23 సెకెన్లలో కనిపెట్టండి

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:47 PM

ఫొటోల మధ్యలో తేడాలను గుర్తించే పజిల్స్ అనేవి సరదాగా ఉండటమే కాకుండా మన మెదడుకు మంచి వ్యాయామం కూడా. ఇవి మనసుకు ప్రశాంతతను ఇస్తూనే ఆలోచనా శక్తిని కూడా పెంచుతాయి.

మీ దృష్టి రేంజ్ ఎంత.. ఈ ఫొటోల మధ్యలో మూడు తేడాలను 23 సెకెన్లలో కనిపెట్టండి
Picture Puzzle

ఫొటోల మధ్యలో తేడాలను గుర్తించే పజిల్స్ అనేవి సరదాగా ఉండటమే కాకుండా మన మెదడుకు మంచి వ్యాయామం కూడా. ఇవి మనసుకు ప్రశాంతతను ఇస్తూనే ఆలోచనా శక్తిని కూడా పెంచుతాయి. మొదటి చూపులో రెండు చిత్రాలు పూర్తిగా ఒకేలా కనిపిస్తాయి. కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే వాటిలో దాగి ఉన్న సూక్ష్మమైన తేడాలు బయటపడతాయి. ఇలాంటి పజిల్స్ మన ఏకాగ్రత, గమనించే శక్తి, పరిశీలనా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి.


పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక బాలుడు ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. పక్క పక్కనే ఉన్న రెండు ఫొటోల్లోనూ అదే దృశ్యం కనబడుతోంది. చూడడానికి రెండు ఫొటోలూ ఒకేలా ఉన్నాయి. అయితే ఆ రెండు ఫొటోల మధ్య మూడు చిన్న చిన్న తేడాలున్నాయి. జాగ్రత్తగా గమనిస్తేనే ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలను కనిపెట్టగలరు. 23 సెకెన్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ మూడు తేడాలేంటో మీకు తెలుస్తుంది.

puzzle4.jpg


ఇవి కూడా చదవండి..

పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. తిరస్కరించిన ఇరాన్..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 31 , 2026 | 01:48 PM