Share News

పెళ్లి పీటలపై ఊహించని ఘటన.. ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిన వధువు..

ABN , Publish Date - May 03 , 2026 | 07:25 AM

పెళ్లికి కొన్ని క్షణాల ముందు పెళ్లి కుమారుడికి ఊహించని షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు. వరమాల వేయాల్సిన సమయంలో పెళ్లి పీటల మీదనుంచి ప్రియుడితో పాటు పారిపోవడానికి ప్రయత్నించింది.

పెళ్లి పీటలపై ఊహించని ఘటన.. ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిన వధువు..
bride garlands lover

ఇంటర్‌నెట్ డెస్క్: పెళ్లికి కొన్ని క్షణాల ముందు పెళ్లి కుమారుడికి ఊహించని షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు. వరమాల వేయాల్సిన సమయంలో పెళ్లి పీటల మీదనుంచి ప్రియుడితో పాటు పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చింద్వారా జిల్లాకు చెందిన ఓ అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 27వ తేదీ రాత్రి ఇద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. వధువు కుటుంబసభ్యులు బరాత్‌తో వధువు ఇంటికి వచ్చారు.


పెళ్లితంతు ప్రారంభమైంది. స్టేజి మీద వధూవరులు వరమాలలు మార్చుకోవాల్సి ఉంది. వధువు వరమాలను చేతుల్లోకి తీసుకుని నిల్చుంది కానీ, వరుడి మెడలో వేయలేదు. కొద్దిసేపటి తర్వాత స్టేజి మీద నుంచి కిందకు పరిగెత్తింది. జనం మధ్యలో ఉన్న ప్రియుడి మెడలో వరమాల వేసింది. అతడితో కలిసి అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. పెళ్లి కుమారుడి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. పారిపోతున్న ఇద్దరినీ అక్కడి జనం పట్టుకున్నారు.


వధువు ప్రియుడిని అందరూ కలిసి చావగొట్టారు. పెళ్లి కూతురిని బలవంతంగా స్టేజి మీదకు తీసుకువచ్చారు. అయితే, పెళ్లి కుమారుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. బంధుజనంతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. పోతూ,పోతూ పెళ్లి కూతురికి ఇచ్చిన బహుమతులను కూడా తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనపై పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని తెలిసినా.. మోసపూరితంగా తమ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారంటూ వధువు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి

ఇరాన్ మళ్ళీ 'దురుసుగా ప్రవర్తిస్తే' సైనిక దాడులు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

సవాలు విసిరే పాత్రలంటే ఇష్టం

Updated Date - May 03 , 2026 | 07:48 AM