తండ్రి ఫోన్ తీసుకుని ఆన్‌లైన్ గేమ్ ఆడిన బాలుడు.. రూ. 42 వేలు హాంఫట్..
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:43 PM
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన ఓ బాలుడు చదువుకుంటానని చెప్పి తండ్రి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడి 42 వేల రూపాయలు పోగొట్టేశాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన ఓ బాలుడు చదువుకుంటానని చెప్పి తండ్రి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడి 42 వేల రూపాయలు పోగొట్టేశాడు. ఈ సంఘటనపై బాలుడి అన్న రెడ్డిట్‌లో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో ఏం జరిగిందో వివరించాడు. పోగొట్టుకున్న డబ్బులను ఎలా తిరిగి పొందాలో చెప్పమంటూ నెటిజన్లను కోరాడు. ఆ పోస్టులో ఏముందంటే..
‘అందరికీ హాయ్.. నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. నిన్న మా తమ్ముడు మా నాన్న ఫోన్ తీసుకున్నాడు. 8వ తరగతి క్లాస్‌లు వినడానికి అన్నాడు. అయితే, అతడు ఆ ఫోన్‌ను చదువు కోసం కాకుండా.. ఆన్‌లైన్ గేమ్ ఆడ్డానికి వాడాడు. ఏకంగా 42 వేల రూపాయలు పెట్టి రోబ్లక్స్ గేమ్ రోబక్స్ కొన్నాడు. అన్నిటిని వాడేశాడు. ఇప్పుడు 100 మాత్రమే అతడి ఖాతాలో ఉన్నాయి. ఆ డబ్బులను ఎలా తిరిగి పొందాలో ఎవరైనా చెప్పగలరా?.. అప్పు తీర్చడానికి.. స్కూలు ఫీజు కట్టడానికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
బాలుడు కొన్న రోబక్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశాడు. ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు డబ్బులు ఎలా తిరిగి పొందాలో సలహా ఇస్తున్నారు. కొందరు రోబ్లక్స్ గేమ్ కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేయమని అంటున్నారు. మరి కొందరు బ్యాంక్‌ను సంప్రదించమని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళికలు
‘ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు’.. ప్రకాశ్ రాజ్‌పై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్