మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ ప్రధాని.. ఆనంద్ మహీంద్రా ఫుల్ ఖుష్
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:39 PM
భారత్‌లో తయారైన బీఎస్ఏ బ్యాంటమ్ బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ డ్రైవ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో తయారైన బర్మింగ్‌హమ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) కంపెనీ బ్యాంటమ్ బైక్‌ను యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ డ్రైవ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. వీడియోలో మాజీ ప్రధాని బోరిస్ మాట్లాడుతూ బైక్ అద్భుతమని కితాబునిచ్చారు. సాంకేతిక రంగంలో భారత్-బ్రిటన్ సహకారానికి ఇది మంచి ఉదాహరణ అని అన్నారు.
ప్రస్తుతం బీఎస్ఏ బైక్‌లను మహీంద్రా గ్రూప్ భారత్‌లోనే రూపొందిస్తోంది. యూకే సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలో యూకే మాజీ ప్రధాని కామెంట్స్‌పై ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో నిర్మించిన బైక్‌పై జర్నీని మాజీ ప్రధాని ఎంజాయ్ చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అయితే, బీఎస్ఏ పేరును బోరిస్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీగా మార్చమని మాత్రం తమను అడగవద్దంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్‌కు చెందిన బర్మింగ్‌హమ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) కంపెనీకి ఎంతో చరిత్ర ఉంది. 1861లో ప్రారంభమైన ఈ కంపెనీ మొదట్లో తుపాకీల వంటి చిన్న ఆయుధాలను ఉత్పత్తి చేసింది. ఆ తరువాత క్రమంగా బైక్‌ల ఉత్పత్తి వైపు మళ్లింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ సంస్థ బైక్స్ కీలక పాత్ర పోషించాయి. 1950లను కంపెనీ స్వర్ణ యుగంగా చెబుతారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు బైకుల్లో ఒకటి బీఎస్ఏ బైక్‌గా నిలిచింది. అయితే, కంపెనీ టెక్నాలజీ పాతబడిపోవడం, కార్మికుల ధర్నాలు తదితర కారణాలతో 1970ల నాటికి ఈ బైక్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ తరువాత అత్యాధునిక టెక్నాలజీలతో హోండా వంటి అనేక బ్రాండ్స్ అంతర్జాతీయ బైక్ మార్కెట్‌పై పట్టుసాధించాయి
అయితే, 2016లో మహీంద్రా గ్రూప్ బీఎస్ఏలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. అనంతరం బ్యాంటమ్ మోడల్‌ను పునరుద్ధరించి మళ్లీ విక్రయించడం ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌లో తయారవుతున్న ఈ బైక్ అంతర్జాతీయ మార్కెట్స్‌కు ఎగుమతి అవుతోంది. బీఎస్‌ఏ గోల్డ్‌స్టార్, స్క్రాంబ్లర్ బైక్స్ భారత్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
గాల్లోకి ఎగిరిన పవర్‌బోట్.. వీడియో వైరల్
పరిగెత్తండి.. తినండి.. పరిగెత్తండి.. విశ్వవిద్యాలయంలో వినూత్న ఛాలెంజ్