బస్సులో తప్పుగా ప్రవర్తించిన యువకుడు.. అందరిముందు చితకబాదిన యువతి..
ABN , Publish Date - Jul 25 , 2026 | 08:16 PM
రన్నింగ్ బస్సులో ఓ యువకుడు ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధించాడు. దీంతో ఆ యువతి ఆగ్రహానికి గురైంది. తోటి ప్రయాణికులు, బస్ డ్రైవర్ సాయంతో అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పింది.
ఇంటర్‌నెట్ డెస్క్: రన్నింగ్ బస్సులో ఓ యువకుడు ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధించాడు. దీంతో ఆ యువతి ఆగ్రహానికి గురైంది. తోటి ప్రయాణికులు, బస్ డ్రైవర్ సాయంతో అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పింది. ఈ సంఘటన కర్ణాటకలో శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన ఓ యువతి శుక్రవారం మధ్యాహ్నం హెబ్బల్ నుంచి మాన్యతా టెక్ వెళుతున్న బస్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఆమెతో తప్పుగా ప్రవర్తించడం మొదలెట్టాడు. దీంతో ఆ యువతి ఆగ్రహానికి గురైంది. అతడిపై దాడికి దిగింది. ఈ నేపథ్యంలోనే అతడి చొక్కా చిరిగిపోయింది. విషయం తెలుసుకున్న బస్ డ్రైవర్, తోటి ప్రయాణికులు ఆమెకు మద్దతుగా వచ్చారు. అతడికి తగిన విధంగా సమాధానం చెప్పారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు యువతికి మద్దతుగా నిలుస్తున్నారు. ‘మహిళలతో తప్పుగా ప్రవర్తించేవారిని ఊరికే వదిలిపెట్టకూడదు’..‘ఇలాంటి వ్యక్తులు ఈ మధ్య ప్రతీచోటా ఉంటున్నారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలి’..‘యువతి ధైర్యాన్ని మెచ్చుకోవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే.
స్వ్కాష్ ఛాంపియన్‌షిప్: 21 ఏళ్ల తర్వాత.. టైటిల్‌కు అడుగు దూరంలో అనహత్ సింగ్