Share News

బరువు తగ్గడం కోసం వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న చైనీయులు..

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:39 PM

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. దీంతో బరువు తగ్గించుకోవడం కోసం ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా జిహ్వను అదుపులో పెట్టుకోలేకపోతే బరువు తగ్గడం అసాధ్యం.

బరువు తగ్గడం కోసం వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న చైనీయులు..
viral weight loss trend

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. దీంతో బరువు తగ్గించుకోవడం కోసం ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా జిహ్వను అదుపులో పెట్టుకోలేకపోతే బరువు తగ్గడం అసాధ్యం. ఎంత వ్యాయామం చేసినా, ఆహారం మితంగా తింటేనే ఫలితాలు కనబడతాయి. దీంతో చైనాలో ఓ కొత్త ట్రెండ్ ఊపందుకుంది. దాని గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే (Chewing plastic trend).


చైనాలో తక్కువగా తినడం కోసం చాలా మంది 'క్లింగ్ ర్యాప్ డైట్' అని పిలిచే ఒక వింత పద్ధతిని అవలంబిస్తున్నారు. ముందుగా ప్లాస్టిక్ కవర్‌ను నోటిలో పెట్టుకుని, వారు తినాలనుకునే ఆహారాన్ని ఆ కవర్‌లో ఉంచుతున్నారు. ఆ కవర్‌ను తనివి తీరా నిమిలిన తర్వాత బయటకు ఉమ్మేస్తున్నారు. దీని వల్ల కేలరీలు చేరకుండానే కడుపు నిండిన అనుభూతి మెదడుకు కలుగుతుందని వారు నమ్ముతున్నారు. ఈ విధానం ఆకలిని తగ్గిస్తుందని, బరువును నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు (Viral weight loss trend).


ఈ ట్రెండ్ ప్రస్తుతం చైనా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది (Weight loss myths). అయితే బరువు తగ్గేందుకు ఇది సరైన విధానం కాదని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి చాలా హానికరం అని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే రసాయనాలు నోటిలోకి వెళ్లిపోయి జీర్ణ వ్యవస్థకు హాని కలిగించవచ్చని, విషపూరితంగా మారవచ్చని చెబుతున్నారు. బరువు తగ్గడడం కోసం సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం ఒక్కటే సరైన మార్గమని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇదెక్కడి పిచ్చి బ్రదర్.. రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడతారా..


మీ కళ్ల షార్ప్‌నెస్‌కు టెస్ట్.. ఈ పార్క్‌లో పుస్తకం ఎక్కడుందో 13 సెకెన్లలో గుర్తించండి..

Updated Date - Feb 21 , 2026 | 03:39 PM