ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ పిచ్చి.. డ్రైవింగ్ చేస్తూ కూడా..
ABN , Publish Date - Mar 08 , 2026 | 08:00 AM
బెంగళూరుకు చెందిన మానస మంజునాథ్ అనే ఇంజినీర్‌కు ఆటో ప్రయాణాల్లో దారుణమైన అనుభవం ఎదురైంది. డ్రైవింగ్ సమయంలో కూడా ఆటో డ్రైవర్లు సెల్‌ఫోన్స్‌లో రీల్స్ చూడ్డం ఆమెను భయపెట్టింది.
ఇంటర్‌నెట్ డెస్క్: తక్కువ ధరకే ఎక్కువ డేటా అందుబాటులోకి రావటంతో జనం సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. రోజులో 12 గంటలకు పైగా సెల్ ఫోన్ వాడుతున్న వారు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొంతమంది పనులు చేస్తూ సెల్‌ఫోన్ వాడుతున్నారు. ఆఖరికి వాహనాలు నడుపుతూ కూడా సెల్‌ఫోన్ వాడుతున్నారు. మనుషుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. తాజాగా, బెంగళూరుకు చెందిన మానస మంజునాథ్ అనే ఇంజినీర్‌కు ఆటో ప్రయాణాల్లో దారుణమైన అనుభవం ఎదురైంది. డ్రైవింగ్ సమయంలో కూడా ఆటో డ్రైవర్లు సెల్‌ఫోన్స్‌లో రీల్స్ చూడ్డం ఆమెను భయపెట్టింది.
ఈ విషయంపై మానస తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో తనకు ఎదురైన అనుభవాలను రాసుకొచ్చింది. ‘నేను ఈ వారంలో నాలుగు సార్లు ఆటోలో ప్రయాణించాను. ఆటోల్లో 15 నుంచి 25 నిమిషాల పాటు ప్రయాణించాను. ప్రతీ ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నపుడు కూడా ఆపకుండా ఫోన్ వాడుతూ ఉన్నాడు. స్టోర్‌లలో, సెలూన్లలో, షాప్స్‌లలో.. ఎక్కడ చూసినా జనం పని చేయటం మానేసి ఫోన్స్‌లో బిజీ అయిపోతున్నారు. మన దేశంలో అందరికీ సీరియస్ సెల్‌ఫోన్ అడిక్షన్ వచ్చేసింది’ అని అంది.
మానస పెట్టిన పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి అనుభవాలు నాకు ప్రతీ రోజు ఎదురవుతున్నాయి. నాకు తెలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించటం చాలా మేలు’..‘ట్రాఫిక్ అధికారులు ఇలాంటి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. లేదంటే జనాల ప్రాణాలు పోతాయి’..‘సెల్ ఫోన్ అడిక్షన్ ఇండియాలో చాలా ఎక్కువైంది. చిన్న పిల్లలు కూడా గంటలు గంటలు ఫోన్ వాడుతున్నారు. తల్లిదండ్రులు ఫోన్‌లు ఇచ్చి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రూ.30 లక్షల లాటరీ.. ఎక్కడున్నాడో తెలియని విజేత.. ఏం చేస్తున్నారంటే..
బాబోయ్ చిరుత.. భయాందోళనలో ప్రజలు