Share News

క్లాస్ ‌రూములో స్టూడెంట్‌కు ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. చెప్పుతో చావు దెబ్బలు..

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:46 PM

ఓ ప్రెఫెసర్ విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పడానికి ప్రయత్నించాడు. ఏకంగా క్లాస్ రూములో అందరి ముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ అమ్మాయి, తోటి విద్యార్థులు ప్రొఫెసర్‌పై విరుచుకుపడ్డారు. చెప్పుతో చావ గొట్టారు.

క్లాస్ ‌రూములో స్టూడెంట్‌కు ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. చెప్పుతో చావు దెబ్బలు..
Bengaluru professor proposal

ఇంటర్‌నెట్ డెస్క్: విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ఓ ప్రొఫెసర్ తప్పుదోవపట్టాడు. విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పడానికి ప్రయత్నించాడు. ఏకంగా క్లాస్ రూములో అందరి ముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ అమ్మాయి, తోటి విద్యార్థులు ప్రొఫెసర్‌పై విరుచుకుపడ్డారు. చెప్పుతో చావ గొట్టారు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన అబ్దుల్ మహమ్మద్ నేలమంగళలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు.


మార్చి 26వ తేదీన క్లాస్ చెబుతున్న సమయంలో ఓ విద్యార్థినిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ఆమెపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు. అంతేకాదు.. క్లాస్ రూములో అందరిముందు ఆమెకు ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పాడు. ఆ విద్యార్థిని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా అతడు అంతటితో ఆగలేదు. క్లాస్ రూములో ఉన్న వారందరికీ చాక్లెట్స్ పంచమని ఓ వ్యక్తిని పురమాయించాడు. స్టూడెంట్స్ వాటిని తీసుకోలేదు. ప్రొఫెసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత ప్రొఫెసర్ విద్యార్థిని దగ్గరకు వచ్చాడు. ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా?’ అని ప్రశ్నించాడు.


ఆమెకు తనపై ఇష్టం ఉందని, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాన్ని నిరూపిస్తానని అన్నాడు. విద్యార్థులందరూ సీసీటీవీ ఫుటేజీలను చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రొఫెసర్ భయపడిపోయాడు. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి.. అక్కడినుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ నేపథ్యంలోనే బాధిత విద్యార్థిని ప్రొఫెసర్‌ను చెప్పుతో కొట్టింది. తోటి విద్యార్థులు కూడా ఆయనపై చెప్పులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపి ప్రొఫెసర్‌‌ను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. కంప్లైంట్ ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

ఇంధన నిల్వలు ఉన్నాయి.. ఆందోళన వద్దు: స్టీఫెన్ రవీంద్ర

Updated Date - Mar 26 , 2026 | 02:51 PM