Share News

నడుముపై 27 కేజీల బరువుతో 847 పుష్‌అప్స్.. భారతీయుడి వరల్డ్ రికార్డ్..

ABN , Publish Date - Jul 24 , 2026 | 03:14 PM

హర్యానాకు చెందిన 41 ఏళ్ల రోహ్‌తాష్ చౌదరీ అనే వ్యక్తి గంటలో 847 పుష్‌అప్స్ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. అది కూడా నడుపై 27.21 కిలోల బరువును ఉంచుకుని 847 పుష్‌అప్స్ తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

నడుముపై 27 కేజీల బరువుతో 847 పుష్‌అప్స్.. భారతీయుడి వరల్డ్ రికార్డ్..
Rohtash Chaudhary

ఇంటర్‌నెట్ డెస్క్: హర్యానాకు చెందిన 41 ఏళ్ల రోహ్‌తాష్ చౌదరీ అనే వ్యక్తి గంటలో 847 పుష్‌అప్స్ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. అది కూడా నడుపై 27.21 కిలోల బరువును ఉంచుకుని 847 పుష్‌అప్స్ తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహ్‌తాష్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం అతడు యాక్సిడెంట్ కారణంగా మంచానికి పరిమితమయ్యాడు. రెండేళ్ల పాటు నాలుగు గోడల మధ్య నలిగిపోయాడు. అయితే, విల్ పవర్‌తో మళ్లీ నడవటం మొదలెట్టాడు.


ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేశాడు. ‘పుష్అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతీ ఏటా కొత్త రికార్డు సృష్టిస్తున్నాడు. తాజా విజయంతో వరుసగా పదో సారి ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియోలో.. రోహ్‌తాష్ నడుముపై 27 కేజీల బరువుతో ఎంతో కష్టపడి గంటలో 847 పుష్‌అప్స్ తీశాడు. సిరియాకు చెందిన సామి జోమా హాస్సన్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు రోహ్‌తాష్‌కు సర్టిఫికెట్ అందించారు.


ఇవి కూడా చదవండి

ఇంట్లో చిలుకను పెంచుకోవడం మంచిదేనా?

ఉద్యోగ, ఉపాధికి దగ్గరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

Updated Date - Jul 24 , 2026 | 03:20 PM