హోటల్ గదిలో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన టూరిస్టులు..
ABN , Publish Date - Apr 22 , 2026 | 09:39 PM
బాలిలో పర్యటించడానికి వెళ్లిన నలుగురు టూరిస్టులు పాడు బుద్ధి చూపించారు. హోటల్ గదిలోని వస్తువుల్ని దోచేసి పారిపోవడానికి ప్రయత్నించారు. హోటల్ సిబ్బంది వారి బ్యాగులను చెక్ చేయగా పెద్ద సంఖ్యలో వస్తువులు బయటపడ్డాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇండోనేషియా దేశంలో పర్యటించడానికి వెళ్లిన నలుగురు టూరిస్టులు పాడు బుద్ధి చూపించారు. హోటల్ గదిలోని వస్తువుల్ని దోచేసి పారిపోవడానికి ప్రయత్నించారు. హోటల్ సిబ్బంది వారి బ్యాగులను చెక్ చేయగా పెద్ద సంఖ్యలో వస్తువులు బయటపడ్డాయి. ది బాలి టైమ్స్ తెలిపిన వివరాల మేరకు.. భారత దేశానికి చెందిన నలుగురు టూరిస్టులు ఏప్రిల్ 16వ తేదీన బాలిలోని అస్వర రిసార్ట్ యూబడ్‌లో రూము తీసుకున్నారు. ఏప్రిల్ 19వ తేదీన రూము ఖాళీ చేశారు. వారు వెళ్లడానికి సిద్ధం అవుతుండగా హోటల్ సిబ్బంది వారు ఉన్న గదిని చెక్ చేశారు.
గదిలో చాలా వస్తువులు మిస్ అయినట్లు అర్థమైంది. ఈ నేపథ్యంలోనే నలుగురు టూరిస్టుల బ్యాగులను చెక్ చేశారు. వారి బ్యాగులలో టవళ్లు, హెయిర్ డ్రయర్‌లు, డోర్ మ్యాట్లు, టీవీ రిమోట్ బాక్సులు, ఆహారం తినే పాత్రలు బయటపడ్డాయి. హోటల్ యజమాన్యం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. వారి నుంచి ఒక్కరూపాయి కూడా ఎక్కువగా తీసుకోలేదు. తరుణ్ గౌతమ్ అనే వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2026: తేలిపోయిన రాజస్థాన్ బ్యాటర్లు.. లఖ్‌నవూ ముందు స్వల్ప లక్ష్యం
తెలంగాణలో రేషన్ పంపిణీ వేగవంతం