ధనుష్‌తో డేటింగ్ రూమర్స్.. ప్రేమపై ఆసక్తికర కామెంట్లు చేసిన మృణాల్
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:36 PM
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమపై ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘ప్రేమ ఎంతో అందమైన భావన. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికి ప్రేమ కచ్చితంగా పుడుతుంది. అది మనల్ని ఓ మంచి వ్యక్తిగా మారుస్తుంది’ అని చెప్పుకొచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని నెలల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో జరిగిన ఓ రెండు ఈవెంట్లలో ఇద్దరూ కలిసి కనిపించారు. దీంతో పుకార్లు మరింత ఊపందుకున్నాయి. డేటింగ్ పుకార్లపై కొద్దిరోజుల క్రితం మృణాల్ స్పందించారు. ధనుష్ మంచి ఫ్రెండ్ అని అన్నారు. ధనుష్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత రెండు రోజుల నుంచి ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. మృణాల్ .. ధనుష్‌ను సోదరుడని సంభోదించినట్లుగా ఆ పోస్టులో ఉంది.
మీడియా సైతం ఆ పోస్టుపై కథనాలు రాసింది. ఇలాంటి సమయంలో మృణాల్ ప్రేమ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..‘ప్రేమ ఎంతో అందమైన భావన. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికి ప్రేమ కచ్చితంగా పుడుతుంది. అది మనల్ని ఓ మంచి వ్యక్తిగా మారుస్తుంది. మనలోని పసి ఛాయలను దూరం చేస్తుంది. ప్రేమ ప్రపంచంలోనే ఒక అందమైన విషయం. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఓ మంచి ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మహిళలే ఎక్కువ ప్రేమను చూపిస్తారు కదా అని అడిగిన ప్రశ్నకు మృణాల్ సమాధానం ఇస్తూ.. ‘ప్రేమలో ఉన్నవారు ఎవరైనా సరే.. ఆడ కావచ్చు.. మగ కావచ్చు.. ఎదుటి వ్యక్తి కోసం ఏదైనా చేసేస్తుంటారు. కానీ, కొన్ని సార్లు మనం ఆశించినంత ప్రేమ దొరకదు.. మన ప్రేమను ఎదుటి వ్యక్తి గుర్తించకపోవచ్చు. ప్రస్తుత కాలంలో ప్రేమకు అర్థం మారిపోతోంది. మనం ఎంత ప్రేమను పొందుతున్నాం అన్నదే అసలు విషయం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
నిరుద్యోగులను నమ్మించి నయవంచన.. రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
నాటుకోడి ధరలపై ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన