డ్రోన్ ఇంటికొస్తే సంబరపడ్డ మహిళ.. ఇంతలో భారీ షాక్.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:53 AM
డ్రోన్‌లతో వస్తువుల డెలివరీకి అంగీకరించిన మహిళకు తాజాగా ఊహించని అనుభవం ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: డ్రోన్‌తో వస్తువులు డెలివరీ అవుతాయనుకుని సంబరపడ్డ ఓ అమెజాన్ కస్టమర్‌కు ఇటీవల ఊహించని షాక్ తగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇకపై డ్రోన్ డెలివరీలకు అంగీకరించేదే లేదని ఆ కస్టమర్ తెగేసి చెప్పింది.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన వస్తువులను డెలివరీ ఏజెంట్లు ఇంటికి చేరవేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇదే వ్యవస్థ కొనసాగుతోంది. అయితే, ఏఐ, ఆటోమేషన్‌ను అందిపుంచుకున్న అమెజాన్ సంస్థ యూఎస్‌లో డ్రోన్‌లతో వస్తువులను సరఫరా చేయడం ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రైమ్ ఎయిర్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ ప్రైమ్ ఎయిర్ సర్వీసు ద్వారా వస్తువుల డెలివరీకి అంగీకరించింది.
ఆ తరువాత డ్రోన్ తన ఇంటి సమీపానికి వచ్చిందని తెలిసి ఆమె బయటకు వెళ్లింది. తను ఆర్డరిచ్చిన వస్తువును ఆ డ్రోన్ మెల్లగా నేలమీద పెట్టి వెళ్లిపోతుందని భావించింది. కానీ, డ్రోన్ మాత్రం మహిళ వస్తువును స్వీమ్మింగ్ పూల్‌లో జారవిడిచి తిరిగెళ్లిపోయింది. దీంతో, ఆమెకు దిమ్మతిరిగినంత పనైంది. ‘ఆ దృశ్యం చూసి షాకైపోయా. ఇకపై డ్రోన్ డెలివరీలకు ఎన్నడూ అంగీకరించేదే లేదు’ అని ఆమె స్థానిక మీడియా ప్రతినిధుల వద్ద స్పష్టం చేసింది.
ఎయిర్ ప్రైమ్ సర్వీస్‌ను తాము మరింతగా విస్తరించనున్నట్టు అమెజాన్ ప్రకటించిన రోజునే ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే, ఇలాంటి సందర్భాల్లో పూర్తిస్థాయి రీఫండ్ లేదా కొత్త వస్తువును ఇస్తామని అమెజాన్ గతంలోనే ప్రకటించింది. డ్రోన్ డెలివరీల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉందని కూడా అమెజాన్ పేర్కొంది. అయితే, వీడియోలో కనిపించిన తప్పులు మాత్రం అత్యంత అరుదుగా మాత్రమే జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఈ సంవత్సరం ఇప్పటికే అమెజాన్ వేల కొద్దీ డ్రోన్ డెలివరీలను పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో మరో 500 నగరాలకు డ్రోన్ డెలివరీ సేవలను విస్తరిస్తామని కూడా అమెజాన్ పేర్కొంది. చికాగో, అట్లాంటా, క్లీవ్‌లాండ్ నగరాలు వాటి శివారుల్లోని సబర్బన్ ప్రాంతాల్లోని వారికి డ్రోన్‌ల సాయంతో వస్తువులను అరగంటలోపే చేరుస్తామని చెప్పింది.
ఈ వార్తలనూ చదవండి:
మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన
పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్