చారిటీ కోసం ప్రాణాలకు తెగించిన వృద్ధుడు.. 91 ఏళ్ల వయసులో స్కైడైవ్..
ABN , Publish Date - Jul 13 , 2026 | 08:17 AM
91 ఏళ్ల వృద్ధుడు చారిటీ కోసం తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు. 4 లక్షల రూపాయల కోసం వేల అడుగుల ఎత్తునుంచి స్కైడైవ్ చేశారు. ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చిన డబ్బునుంచి అలాన్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. మొత్తం డబ్బును 'రోలీస్ కమ్యూనిటీ సెంటర్'కు అందజేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: 80 ఏళ్లు వచ్చిన తర్వాత చాలా మంది మంచానికే పరిమితం అవుతుంటారు. ఒకవేళ ఆరోగ్యం బాగానే ఉన్నా.. ఇతరుల కోసం తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టాలని అనుకోరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో 91 ఏళ్ల వృద్ధుడు చారిటీ కోసం తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు. 4 లక్షల రూపాయల కోసం వేల అడుగుల ఎత్తునుంచి స్కైడైవ్ చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బ్రిటన్, 'సర్రీ' కౌంటీలోని క్రేన్లీ గ్రామానికి చెందిన 91 ఏళ్ల అలాన్ స్టిల్‌కు సేవాభావం ఎక్కువ. తన గ్రామంలోని వృద్ధుల కోసం వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహించే 'రోలీస్ కమ్యూనిటీ సెంటర్'కు ఆర్థిక సాయం చేయాలని ఆయన అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫండ్ రైజింగ్ కోసం స్కైడైవింగ్ సవాలును స్వీకరించారు. గత నెలలో వేల అడుగుల ఎత్తునుంచి స్కైడైవ్ చేశారు. ఈ స్కైడైవ్ ద్వారా ఆయన ఏకంగా 5,000 డాలర్లకు పైగా (భారత కరెన్సీలో రూ. 4,76,000 కంటే ఎక్కువ) విరాళాలను సేకరించారు. ఆ డబ్బునుంచి అలాన్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు.
మొత్తం డబ్బును 'రోలీస్ కమ్యూనిటీ సెంటర్'కు అందజేశారు. విమానం నుంచి కిందకు పడిపోతున్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ అనుభవం అత్యంత థ్రిల్లింగ్‌గా అనిపించిందని అలాన్ తెలిపారు. 91 ఏళ్ల వయసులో అత్యంత అరుదైన ఘనత సాధించిన అలాన్ స్టిల్ అక్కడితో ఆగిపోవాలనుకోవడం లేదు. ఈ అనుభవం ఇచ్చిన ఉత్సాహంతో ఆయన తన తదుపరి సాహసానికి సిద్ధమవుతున్నారు. బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతంలో గంటకు 160.9 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే 'జిప్ లైన్' రైడ్‌ను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ అణు అంశంపై దౌత్యానికే ట్రంప్ ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు
ఉదయం షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి