6వ తరగతిలోనే ఈ పాఠాలా.. మహిళకు షాక్.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 19 , 2026 | 07:28 PM
6వ తరగతిలో ఏఐకి సంబంధించి సంక్లిష్ట పాఠాలు చూసి ఓ మహిళ షాకైపోయింది. నెట్టింట ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రాకతో ప్రపంచంలో ఊహకందని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యావిధానంలో కూడా ఏఐ కేంద్రంగా అనేక మార్పులు వస్తున్నాయి. స్కూలు దశలోనే విద్యార్థులు ఏఐ పాఠాలు నేర్చుకోవడాన్ని మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో ఏఐకి సంబంధించి 6వ తరగతి పాఠ్యపుస్తకాన్ని చూసి ఒక మహిళ షాకైపోయింది.
జస్వానీ అనే మహిళ ఈ వీడియోను పోస్టు చేసింది. ఏఐ పాఠ్యపుసక్తంలో ఎంతటి సంక్లిష్ట అంశాల్ని చేర్చారో చదవి ఆశ్చర్యపోయింది. 11-12 ఏళ్ల వయసున్న పిల్లల పాఠ్యపుస్తకంలో ఏఐ, మెషీన్ లర్నింగ్, న్యూరల్ నెట్వర్క్, పైథాన్ ప్రోగ్రామింగ్ వంటివి ఉండటం చూసి నోరెళ్లబెట్టింది. ‘6వ తరగతిలోనే ఇలాంటి పాఠాలా? పిచ్చెక్కిచ్చేస్తున్నారుగా!’ అని వ్యాఖ్యానించింది. మునుపటి తరాలకు కంప్యూటర్‌కు సంబంధించి పూర్తిస్థాయి ప్రాథమిక అంశాలు కూడా చెప్పేవారు కాదని మహిళ గుర్తు చేసుకుంది.
ఈ వీడియోపై జనాల నుంచి భారీ స్పందన వచ్చింది. తమ పిల్లలు చదివే స్కూళ్లల్లో 1వ, 3వ తరగతుల నుంచే ప్రోగ్రామింగ్ ప్రారంభమైందని కొందరు చెప్పారు. తాము చదువుకునే రోజుల్లో కేవలం ఫోర్ట్రాన్ వంటి కంప్యూటర్ లాంగ్వేజీలు.. అదీ అరకొరగా చెప్పి పంపించే వారని కొందరు గుర్తు చేసుకున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
రీల్ కోసం రాయి విసిరాడు.. వీడియో వైరల్ కావడంతో..
తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్