విమానాల వైభవం.. వింగ్స్ ఇండియా షో సందడి
ABN, Publish Date - Jan 29 , 2026 | 06:49 PM
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా (Wings India) ప్రదర్శన రెండో రోజూ సందర్శకులను ఆకట్టుకుంది. దేశ, విదేశీ సంస్థలు ప్రదర్శించిన ఆధునిక విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
1/8
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా (Wings India) ప్రదర్శన రెండో రోజూ సందర్శకులను ఆకట్టుకుంది.
2/8
దేశ, విదేశీ సంస్థలు ప్రదర్శించిన ఆధునిక విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
3/8
ఈ ప్రదర్శనలో వాణిజ్య విమానాల నుంచి రక్షణ రంగానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల వరకు అనేక మోడళ్లను ప్రదర్శించారు.
4/8
ఎయిర్‌క్రాఫ్ట్‌లను దగ్గర నుంచి చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన యువత, విమాన సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు.
5/8
విమాన రంగంలో కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను సందర్శకులకు పరిచయం చేశారు.
6/8
విమాన పరిశ్రమలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై చర్చలు, సెమినార్లు కూడా నిర్వహించారు.
7/8
వింగ్స్ ఇండియా ప్రదర్శన భారతదేశ విమాన రంగ అభివృద్ధికి కీలక వేదికగా మారిందని నిర్వాహకులు తెలిపారు.
8/8
రాబోయే రోజుల్లో కూడా అనేక ప్రత్యేక కార్యక్రమాలు, సాంకేతిక ప్రదర్శనలు కొనసాగనున్నట్లు వెల్లడించారు.
Updated at - Jan 29 , 2026 | 07:31 PM