వనపర్తిలో ఘనంగా హోలీ సంబరాలు
ABN, Publish Date - Mar 03 , 2026 | 11:08 AM
వనపర్తి జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
1/6
వనపర్తి జిల్లా కేంద్రంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
2/6
పట్టణంలోని పలు కాలనీలలో చిన్నారులు, యువత, మహిళలు హోలీని ఉత్సాహంగా ఆడుతూ ఆనందంగా పండుగను చేసుకుంటున్నారు.
3/6
యువతి, యువకులు సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ పండుగను మరింత రంగుల మయం చేశారు.
4/6
మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
5/6
కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా డీజే కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు.
6/6
ఉదయం నుంచే కాలనీల్లో హోలీ సందడి మొదలైంది. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, హర్షధ్వానాలు చేస్తూ పిల్లలు ఉల్లాసంగా గడిపారు.
Updated at - Mar 03 , 2026 | 11:08 AM