తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
ABN, Publish Date - Feb 11 , 2026 | 11:49 AM
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది.
1/10
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది.
2/10
సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటేశారు. కొడంగల్ జెడ్పీ హైస్కూల్లోని 6వ వార్డ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
3/10
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డయిరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం ఓటు వేశారు.
4/10
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జిల్లా జ్యోతి నగర్‌లోని ఎస్ఆర్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
5/10
వనపర్తిలో ప్రభుత్వ బాలుర కళాశాల పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
6/10
వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
7/10
మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు.
8/10
కరీంనగర్ జిల్లా మల్కాపూర్ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.
9/10
నర్సంపేట మున్సిపల్ మహేశ్వరంలో ఓ బాలింతరాలు తన పసిబిడ్డను ఎత్తుకుని ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
10/10
భూపాలపల్లి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌లో ప్రజలు ఓటు వేసేందుకు బారులు తీరారు.
Updated at - Feb 11 , 2026 | 12:18 PM