స్వగ్రామంలో విరోష్‌ జోడీ సందడి

ABN, Publish Date - Mar 02 , 2026 | 12:01 PM

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వివాహం అనంతరం మొదటిసారిగా తన స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట్‌కు వెళ్లారు. ఆయనతో పాటు భార్య రష్మిక మందన్న కూడా ఉన్నారు.

స్వగ్రామంలో విరోష్‌ జోడీ సందడి 1/6

టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్‌గా జరిగింది.

స్వగ్రామంలో విరోష్‌ జోడీ సందడి 2/6

పెళ్లి తర్వాత తొలిసారిగా విజయ్ తన సొంతూరైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట్‌కు వెళ్లారు. ఆయనతో పాటు భార్య రష్మిక కూడా ఉన్నారు.

స్వగ్రామంలో విరోష్‌ జోడీ సందడి 3/6

గ్రామానికి చేరుకున్న వెంటనే విజయ్–రష్మిక జంటకు గ్రామస్తులు, బంధువులు ఘన స్వాగతం పలికారు.

స్వగ్రామంలో విరోష్‌ జోడీ సందడి 4/6

సంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

స్వగ్రామంలో విరోష్‌ జోడీ సందడి 5/6

తుమ్మన్ పేటలో నూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు.

స్వగ్రామంలో విరోష్‌ జోడీ సందడి 6/6

స్వగ్రామంలోనే రిసెప్షన్ ఏర్పాటు చేయగా టాలీవుడ్ నటుల రాకతో తుమ్మంపేట గ్రామ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

Updated at - Mar 02 , 2026 | 12:10 PM