తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
ABN, Publish Date - Feb 13 , 2026 | 09:42 AM
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. దాదాపు 12 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
1/6
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫ్రారంభం.
2/6
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.
3/6
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి.
4/6
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ కౌంటింగ్ సెంటర్లో ఓట్ల లెక్కింపు మొదలైంది.
5/6
కౌంటింగ్ కేంద్రం బయట మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు వేచి ఉన్న దృశ్యాలు.
6/6
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ కౌంటింగ్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి.
Updated at - Feb 13 , 2026 | 09:50 AM