చర్లపల్లి జైలు నుంచి 91 మంది ఖైదీల విడుదల
ABN, Publish Date - Jun 02 , 2026 | 09:29 PM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి జైలు నుంచి 91 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. మంగళవారం వారంతా విడుదలయ్యారు.
1/12
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి జైలు నుంచి 91 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.
2/12
మంగళవారం (2026, జూన్2) వారంతా విడుదలయ్యారు.
3/12
విడుదలైన ఖైదీల్లో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.
4/12
వారిలో 38 మంది జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని జైళ్ల శాఖ ఐజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు.
5/12
ఈ రోజే వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందజేశామన్నారు.
6/12
నలుగురు ఖైదీలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశామని చెప్పారు.
7/12
జైలుకు వచ్చిన వారికి వివిధ అంశాల్లో నైపుణ్యాలు నేర్పిస్తామని తెలిపారు.
8/12
జైలు నుంచి విడుదలయ్యాక ఈ నైపుణ్యాలు వారి జీవనోపాధికి సహకరిస్తాయని పేర్కొన్నారు.
9/12
జైలు నుంచి విడుదలైన వారు ప్రతి 15 రోజులకు ఒకసారి స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో సంతకం చేయాల్సి ఉంటుందని వివరించారు.
10/12
విడుదలైన వారు మరోసారి నేరాలు చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని వారికి సూచించారు.
11/12
క్షమాభిక్ష పొంది.. విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రాలేదని సౌమ్య మిశ్రా వెల్లడించారు.
12/12
జైలు నుంచి విడుదలై.. అధికారితో ముచ్చటిస్తున్న ఖైదీ
Updated at - Jun 02 , 2026 | 09:50 PM