మాజీ ఎంపీ కవిత ఇంటి దగ్గర సంబరాలు
ABN, Publish Date - Feb 27 , 2026 | 02:42 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, మాజీ ఎంపీ కవిత నిందితురాలిగా ఉన్న ఢిల్లీ మద్యం కేసును కోర్టు కొట్టేసింది. ఢిల్లీ మద్యం కేసులో రిలీఫ్ లభించడంతో కవిత అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1/7
తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, మాజీ ఎంపీ కవిత నిందితురాలిగా ఉన్న ఢిల్లీ మద్యం కేసును కోర్టు కొట్టేసింది.
2/7
ఢిల్లీ మద్యం కేసులో రిలీఫ్ లభించడంతో కవిత అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3/7
హైదరాబాద్ బంజారా హిల్స్‌లో మాజీ ఎంపీ కవిత ఇంటి వద్ద, ఆమె అభిమానులు స్వీట్లు పంచుకుంటూ, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
4/7
కోర్టు తీర్పుపై కవిత మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని అన్నారు.
5/7
'లిక్కర్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని కోర్టు తేల్చింది. రాజకీయ కారణాలతోనే నాపై కేసు పెట్టారు. లిక్కర్ కేసును ఎవరూ నమ్మలేదు. నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు' అని కవిత అన్నారు.
6/7
'నేను మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. న్యాయవ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. కేసు నుంచి తప్పించడం దేవుడిచ్చిన వరం' అని తెలిపారు.
7/7
'లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర. కేసును అడ్డం పెట్టుకుని నాపై రకరకాలుగా మాట్లాడారు. హింసించిన వారు ఇప్పుడేం చెబుతారు' అంటూ కవిత ప్రశ్నించారు.
Updated at - Feb 27 , 2026 | 02:42 PM