వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు

ABN, Publish Date - Jan 13 , 2026 | 01:04 PM

సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పతంగుల పండుగ, స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20 దేశాలకు చెందిన అంతర్జాతీయ పతంగులు ఎగురవేసే నిపుణులు పాల్గొంటున్నారు.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 1/13

సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పతంగుల పండుగ, స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమయ్యాయి.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 2/13

ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20 దేశాలకు చెందిన అంతర్జాతీయ పతంగులు ఎగురవేసే నిపుణులు పాల్గొంటున్నారు.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 3/13

వివిధ ఆకృతుల్లో, భారీ పరిమాణంలో ఉన్న పతంగులు హైదరాబాద్ ఆకాశాన్ని రంగులమయం చేస్తున్నాయి.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 4/13

ఈ ఈవెంట్‌లో పతంగులతో పాటు, వివిధ రాష్ట్రాల సాంప్రదాయ పిండివంటల ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.అమెరికా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చిన కైట్ మాస్టర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 5/13

పరేడ్ గ్రౌండ్స్ ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోయింది. డ్రాగన్లు, క్రోకడైల్స్, భారీ తిమింగలాలు, సూపర్ హీరోల ఆకృతుల్లో ఉన్న పతంగులు చూపర్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 6/13

ఈ ఏడాది ఉత్సవాల్లో విదేశీయుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 7/13

కేవలం పతంగులు ఎగురవేయడమే కాకుండా, మన భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా సంక్రాంతి వైభవాన్ని చూసి వారు పరవశించిపోతున్నారు.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 8/13

విదేశీ ప్రతినిధులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 9/13

పతంగుల పండుగతో పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న 'ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్' సందర్శకులకు నోరూరిస్తోంది.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 10/13

దాదాపు 50 రకాలకు పైగా విభిన్నమైన మిఠాయిలు, వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రత్యేక వంటకాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 11/13

ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ పిండివంటలైన అరిసెలు, సకినాలు విదేశీయులను ఆకర్షిస్తున్నాయి.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 12/13

పర్యాటక శాఖ సందర్శకుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం వేళల్లో లేజర్ షోలు, డ్రోన్ ప్రదర్శనలు, తెలంగాణ జానపద కళాకారుల ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి.

వైభవంగా కైట్ ఫెస్టివల్.. హాజరైన విదేశీయులు 13/13

కుటుంబ సమేతంగా వచ్చే వారికోసం ప్రత్యేక ఫుడ్ కోర్టులు, పిల్లల కోసం ఆటస్థలాలు ఏర్పాటు చేశారు.

Updated at - Jan 13 , 2026 | 02:19 PM